వైద్య నారాయణుడు

వైద్య నారాయణుడు

రచయిత :: చంద్రకళ. దీకొండ

దౌర్జన్యం స్వైరవిహారం చేసేవేళ…
సమూల సంహారం గావించే
న్యాయమే సుదర్శన చక్రం…!
మూఢవిశ్వాసాలు ముప్పిరిగొనే వేళ…
మటుమాయం చేసే శాస్త్రీయ విజ్ఞానమే సుదర్శన చక్రం…!
అజ్ఞాన తిమిరాన్ని దునుమాడే…
అక్షరమే సుదర్శన చక్రం…!
కనుల ముందు జరుగుతున్న
అన్యాయాన్ని ప్రశ్నించే…
సమాచార హక్కు చట్టమే సుదర్శన చక్రం…!
అక్రమాలను,అవినీతిని,
అసమానతలను
తుదముట్టించే సమధర్మమే సుదర్శన చక్రం…!
వ్యాధుల బాధలను రూపుమాపే వైద్య నారాయణుని చేతనున్నదే…
ఆ సుదర్శన చక్రం…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!