(అంశం: “ఏడ తానున్నాడో”)
నా చెలికాడ
రచన: డి. స్రవంతి
నడి సంద్రాన నిలిచిన నాకు తోడువైనావు
ఎండమావి జీవితాన వెన్నెలలు కురిపించావు
నిను తలచిన ప్రతీ క్షణం మదిలో తెలియని కలవరం
నా కనులలో కదిలే నీ కలలే అలలై నిను చేరనే
నిను చూసిన నాడు నా మదిలో వెలిగేనే విధ్యులత…
నా మది నీకై పరితపించేనే..
నిశీధిలో నాకై వెలుగులు నింపిన నా చెలికాడ ఏడ తానున్నావో…