సంజీవని

సంజీవని

రచయిత :: కమల ముక్కు (కమల’శ్రీ’)

చెట్ల వేర్లు భూమిలోపలికి చొచ్చుకుపోయి
నేలని సారవంతం చేస్తాయి…!!!

ఆకులు కిరణజన్య సంయోగక్రియ జరిపి
ప్రాణవాయువుని అందిస్తాయి…!!!

అనువణువూ ఔషధాలతో నిక్షిప్తమై
సంజీవనిలా ప్రాణాలు కాపాడుతాయి…!!!

పర్యావరణాన్ని సమతుల్యం చేసి
వర్షాలు కురిసేలా చేస్తాయి…!!!

స్వార్ధం తో చెట్ల కుత్తుకలు తెగనరికి
ప్రాణవాయువు కూడా డబ్బుతో
కొనుక్కునే దుస్థితి తెచ్చుకున్నారు…!!!

ఇకనైనా కనువిప్పు తెచ్చుకుని
వృక్షాలను నాటుదాం మన ప్రాణాలను కాపాడుకుందాం…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!