ఇష్టం
రచయిత :: శాంతి కృష్ణ
నను కవ్వించే నీ
కొంటె చూపులు ఇష్టం…
ఆ కొంటె చూపులు రువ్వే
నాయనాలు మరింత ఇష్టం….
లయబద్ధమైన నీ
ఉచ్వ్వాస నిచ్వాసలు ఇష్టం….
మన ఊపిరుల
కలయిక మరింత ఇష్టం….
మధుర పలుకులు పలికే నీ
అధరాలు ఇష్టం….
మన అధరాల మధ్య జరిగే
అంతులేని యుద్ధం మరింత ఇష్టం……
నా కన్నీటిని తుడిచే నీ
చరణాలు ఇష్టం….
అనునిత్యం నాకు తోడుండే
నీ చరణ సాంగత్యం మరింత ఇష్టం….
నను మైమరపించే నీ
దేహ సుగంధం ఇష్టం….
నీలో సగమై ఒకే దేహమై
మురిసిపోవడం మరింత ఇష్టం…