కలయా?…నిజమా?

కలయా?…నిజమా?
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)  

రచన: రమ్య

రాత్రి 11.30 నిమిషాలు నేను ఒక్కడినే బైక్ పై వెళ్తున్నాను ఎప్పటి నుండో  మా ఫ్రెండ్స్ అంత ఇలా బైక్ పై ట్రిప్ కి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నాం. ఈ రోజు ఉదయమే నా ఫ్రెండ్ రాజు ఫోన్ చేసి నాకు  ట్రిప్ గురుంచి చెప్పాడు. ఫైనల్లీ ఇన్ని రోజులకి కుదిరింది నాకు చాలా హ్యాపీ గా అనిపించింది. ఇంట్లో అమ్మని ఒప్పించే సరికి నా తల ప్రాణమ్ తోక లోకి వచ్చింది. ఎలాగోలా కాళ్ళ మీద పడి దండాలు పెట్టి, కాకా పట్టి మా అమ్మని ఒప్పించగలిగాను.
ఇంకా ఆఫీస్ లో మా బాస్ వన్ వీక్  లీవ్ అంటే ఆయనకి హార్ట్ ఎటాక్ రావడం ఖాయం ఆయన్ని ఎలా కాకా పట్టాలో ఆలోచిస్తూ ఆఫీస్ కి వెళ్ళాను
ఫేస్బుక్ చూసి బాస్ మీద నాలుగు మంచి కొటేషన్స్ ( పొగడ్తలు దానికి పడిపోని వారు ఎవరు ఉండరు కదా), ఆయన్ని నవ్వించి మెప్పించడానికి కొన్ని జోక్స్  అన్నింటినీ ప్రిపేర్  చేసుకొని ప్రెసెంటషన్ కి రెడి గా ఉన్నాను .ఆయన రావడమే లేట్ ఆయన్ని ప్రసన్నం చేసుకొని ఇప్పుడే ఇంటికి వెళ్లిపోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. నా ఎదురుచూపులు ఫలించి ఒక గంట లేట్ గా ఆఫీస్ కి వచ్చాడు.
అసలు బాస్ అంటే ఇలానేనా ఉండేది టైం కి ఆఫీస్ కి రావాలని కూడా తెలీదా అని గట్టిగా అడగాలి అనిపించింది. కానీ నేను ఎంప్లొయ్ ఆయన బాస్ అని నా అంతరాత్మ బోధించే సరికి నవ్వుతూ లెగిసి విష్ చేసాను. మా బాస్ వెనకే  నేను కూడా క్యాబిన్ లోకి ఒక ఫైల్ తీసుకొని వెళ్లి బాగా శాంతియుతంగా చర్చలు జరిపిన తరువాత ఒక 6 ఫైల్స్ ఇచ్చి కంప్లీట్ చేసి లీవ్ సాంక్షన్ చేసాడు. మార్క్ జుకర్బర్గ్ కి నా మనసులోనే  దండాలు పెట్టుకున్నా ఎందుకు అంటే .జ్. జ్ మంచి మంచి కొటేషన్స్ నాకు ఆటో లా మీద ఆ తరువాత ఫేస్ బుక్ లొనే కనిపిస్తాయి. ఆఫీస్ వర్క్ అంత అయిపోయేసరికి 10 అయింది.
మా రాజు  గాడికి ఫోన్ చేస్తే వాళ్ళు స్టార్ట్ అయ్యి పక్క ఊరి కొండ మీద  ఫస్ట్ కాంప్ ఫైర్ పెడతము  అక్కడికి వచేయమని చెప్పారు. మా అమ్మకి నా మీద కోపంగా ఉన్నా కానీ లగేజీ పాక్ చేసి పెట్టేసింది
అమ్మ లా  ఎవరు  ప్రేమించలేరు కదా . అలా మొదలైనది నా ప్రయాణం ఇంకా 40 నిమిషాల ప్రయాణం తరువాత నేను రాజు చెప్పిన చోటుకి వెళ్తాను. ఇప్పటి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఎందుకో కొంచెం వేడిగా మారింది. కొంచెం దూరం లో నాకు  ఎవరో మనిషి ఉన్నట్టు అనిపించింది.
కొంచెం స్లో గా వెళ్తే అక్కడ ఒక అమ్మాయి ఉంది ఇంత రాత్రి పూట అది ఈ ప్లేస్ లో అని నాకు ఆశ్చర్యంగా అనిపించి బైక్ ఆపాను. ఆ అమ్మాయి  కొండ  పైకి వెళ్ళాలి మా ఫ్రెండ్స్ వున్నారు అని అనడంతో  సరే అని లిఫ్ట్ ఇచ్చాను. ఆ అమ్మాయి శరీరం నుండి ఏదో వింత పరిమళం వస్తుంది.
వివరాలు అడుగుదాం అనుకున్నా కానీ మళ్ళీ ఎం అనుకుంటుందో అని సైలెంట్ గా ఉన్నాను.
కొంచెం సేపటికి నాకు ఎందుకో బైక్  బాలన్స్ చేయడం కుదరడం లేదు వెనక చాలా పెద్ద బరువు ఉన్నట్టు అనిపిస్తుంది. డ్రైవ్ చేయడం చాలా కష్టంగా ఉంది. నేను మిర్రర్ లో వెనక అమ్మాయి ని చూద్దామని చూసాను నాకు అంత చీకటిగా ఉంది తప్ప మనిషి కనిపించలేదు. అప్పుడే సడన్ గా రెండు చేతులు పెద్ద పెద్ద గోళతో గట్టిగా నా పీక నొక్కడానికి వచ్చాయి. నేను  భయపడి గట్టిగా అరిచాను నాకు ఎం కాకపోయే సరికి కొంచెం దైర్యం తెచ్చుకొని కళ్ళు తెరిచాను. చూస్తే నా బెడ్ మీదే ఉన్నాను  టైం చూస్తే 5.30 అయింది. ఇది కల అని కుదుటపడ్డాను. అప్పుడే ఫోన్  మోగడంతో  ఇంత పొద్దునే ఎవరా అని నెంబర్  చూస్తే డిస్ప్లే మీద నాకు రాజు పేరు కనిపించింది. అంటే ఈ కల నిజావుతుందా?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!