చివరి కోరిక

చివరి కోరిక
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

రామనాధం మాష్టారు విశ్రాంతజీవితం గడుపుతున్నారు. భార్య పోయి రెండు సంవత్సరాలైంది. కొడుకులిద్దరు విదేశాల్లో స్థిరపడిపోయారు.
భార్య చనిపోయినప్పుడు హడావుడిగా వచ్చి ముళ్ళమీద ఉన్నట్టుండి వెళ్ళిపోయారు. తమతో రామనాధాన్ని వచ్చేయమన్నారు గాని అక్కడ తనకేమి తోచదని ఇండియాలోనే ఉండిపోయారు. ఉన్నచోటకాక పరాయిచోట ఎలా ఉండగలరు? తనకు శక్తి ఉన్నంతకాలం తనపనులను చేసుకోగలనని, అశక్తుడయ్యాక ఎవరి సహాయం తీసుకొని గడపగలనని నిష్కర్షగా చెప్పేశారు. తాను పుట్టి పెరిగిన ఊరోదలి రాలేనని చెప్పేశారు. ఆరవై ఎళ్ళు పైబడినా తన ఆరోగ్యానికేమి ఇబ్బందిలేదు. తనెంతో క్రమశిక్షణగా ఉండేవాడు. అదే క్రమశిక్షణతో గడపగలుగుతున్నాడు.
ఇవన్నీ పక్కన పెడితే అతని భార్య చివరి కోరికను తీర్చవలసిన బాధ్యత తనపైన వుంది. అది నెరవేర్చిగాని తాను కన్ను మూయలేడు. అతని భార్య కోరిందేమి చిన్నవిషయం కాదు. కానీ పెంచిన పిల్లలు రెక్కలోచ్చాక ఎగిరివెళ్ళిపోయారు. ఎక్కడో విదేశాలలో స్తిరపడిపోయారు. ఇక్కడ తల్లిదండ్రుల విషయం పట్టించుకోకుండా తమ స్వార్ధమే చూసుకుంటున్నారు. అలాంటివారికి ఒక ఆసరా కావాలి. అందుకే అనాధాశ్రామాన్ని ఏర్పాటు చేయమంది. తన పుట్టింటి వారిచ్చిన మూడెకరాల పొలాన్ని అమ్మేసి ఆశ్రమాన్ని ఏర్పాటు చేయమంది. రామనాధం మాష్టారు ఆ కార్యక్రమాలలోనే తలమునకలై ఉన్నారు. భార్య మూడో వర్ధంతి నాటికి అది పూర్తిచేయాలనే కృతనిశ్చయంతో శ్రమిస్తున్నారు. అది తన ఒక్కడి వల్ల అయ్యేపనికాదని తనకు అత్యంత ఆప్తులైన తన తోటి విశ్రాంతజీవితం గడుపుతున్న ఉపాధ్యాయుల సహాయం తీసుకున్నాడు. అతని ఆశయానికి వాళ్ళంతా ఆశ్చర్యపోయినా తమవంతు సహకారం అందించసాగారు. ఇది నిజంగా గొప్ప విషయమే కదా. భార్య చివరికోరిక తీర్చడమెంతమందికి కుదురుతుంది చెప్పండి.
ఎక్కడో ఒకచోట ఇలాంటి వ్యక్తులు తారసపడుతుంటారు మరి. వారిని మనస్పూర్తిగా అభినందించాల్సిందే కదా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!