ఒక  నల్లి ఆ(ని)వేదన

ఒక  నల్లి ఆ(ని)వేదన
   (తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)  

రచన: కందర్ప మూర్తి 

 ఒక నల్లి  ఆ(ని)వేదన (నా దీన గాధ  విని నవ్వుకోకండి జనులారా నగరంలో అదో పెద్ద మురికి వాడ. మురుగు చెరువు వద్ద అన్ని ప్రాంతాల  నుంచి  వచ్చిన  వివిధ  జాతుల దోమల  సమ్మేళనం  జరుగుతోంది. రకరకాల  రంగుల  ధారణతో  గుర్తింపు  కోసం  దోమల సమూహాలు సమావేసానికి వచ్చాయి. మలేరియ, డెంగు, చికున్ గున్య,  మెదడువాపువ్యాధి,  ఫైలేరియ ( బోదకాలు)  దోమలు  విడివిడిగా  వరుసల్లో ఆసీనులయాయి. ప్రతి  జాతి  దోమల  ప్రతినిధులు  వేదిక  మీద  ఆసీనులయాయి. వేదిక  మద్యలో  ఒక పెద్ద ” నల్లి ”  బంధింపబడి  ఉంది.   సమావేసానికి  అద్యక్షత  వహించిన  మలేరియ  మరిగడ  దోమ ఉపాన్యాసం  ప్రారంభిస్తు ” మిత్రులారా !  మనం  వేరువేరు  జాతుల వారిమైనా  మనదంతా  ఒకేటే  కులం. దైనందిన  జీవనంలో   మనం  మనుషులు,  జంతువుల  నుంచి ఆహారం( రక్తం) సేకరించి  ఇతర కీటకాల మాదిరి రోజులు వెళ్లదీస్తున్నాము.
ప్రస్తుతం  మనుషులు  వివిధ  శాస్త్ర పరిక్షలు  జరిపి  రసాయనాల ప్రయోగంతో  మన జాతుల  నిర్మూలనానికి   ప్రయత్నిస్తున్నారు.  ఇటువంటి  ఆపత్కాల  సమయంలో  పులి మీద  పుట్రలా  మరొక పెద్ద శత్రువు  మన పొట్టలు  కొట్టడానికి  బయలుదేరాడు.” చూడండి,  బానపొట్ట,  చిప్ప మొహం, వంకర  కాళ్లతో  జానపద చిత్ర బ్రహ్మ  విఠలాచార్య  సినిమాలో  కరాళ రాక్షసుడు  మహంకాళి వెంకయ్యలా ఉన్నాడు. గవర్నమెంటు  జ్వరాల  ఆస్పత్రి  పాత సామాన్లు  విరిగిన  తుప్పు మంచాల  మద్య  ఉంటే  మన గూఢచారి  సిబ్బంది  బంధించి  తీసుకు వచ్చారు.  మన పొట్టలు  కొట్టే  ఇటువంటి  శత్రువుల  బారి నుంచి  మీరందరు జాగ్రత్తగా  ఉండాలని  ఈ సమావేశ  పర్చడమైందంటు  తన  ఉపన్యాసం సాగిస్తుండగా  వేదిక మీద బంధింప  బడిన  మశకం ( నల్లి ) అరుస్తూ” మిత్రులారా ! నేను  మీ శత్రువును  కాను , మిత్రుడినే.  మానవ  భాషలో నన్ను ” నల్లి ” అంటారు.
ఒకానొకప్పుడు  మా జాతి  కూడా  మీ దోమల  మాదిరి  గుంపులు గుంపులుగా  ఇళ్లలో, హోటళ్లు, సినిమా హాళ్లు, హాస్పిటల్సు, రైళ్లు ఇలా అనేక  ప్రదేశాల్లో  కర్ర మంచాలు, పరుపులు, కుర్చీలు, బెంచీలు, గోడలు నివాసాలుగా  చేసుకుని రక్తం తాగుతు  సుఖంగా  ఉండే  వాళ్లము. ఒకసారి కడుపు నిండా రక్తం తాగితే కొద్ది రోజులు ఆహారం లేక పోయినా బ్రతికేస్తాము. రాత్రిళ్లు  చెక్క మంచాలు,  పరుపులు,  బస్సు సీట్లు,  రైలు బెర్తులు, సినిమా హాళ్ల కుర్చీలు,  బెంచీలు,  ఆఫీసుల్లో  కుర్చీలు బల్లలు  ఇలా ఇందు గలడందు  లేదన్న  విధంగా  ప్రతి చోట  మేముంటు  బ్రతికే  వాళ్లము. మా ప్రాణాలకు  ముప్పు  ఉందంటే  ఇళ్ల గోడలు,  కిటికీ తలుపు సందుల్లో  దూరి  నక్కి  ఉండేవాళ్లం. రాత్రిళ్లు  మీ దోమ  జాతులతో   మా నల్లి జాతి   కుటుంబ  సబ్యుల్లా కలిసి  ఉండేవాళ్లము. రాత్రి  వేళల్లో  మనుషులకు  నిద్రాభంగం  జరిగినా మా వల్ల  ఎటువంటి  వ్యాధులు  సంక్రమించవు.
అలా  ఆనందంగా  దేశం  నలు  దిశలా  జీవించే  మా నల్లి జాతి ఒక్కసారిగా  నాశనమై   ఈతరం  పిల్లలకు  మనుషులకు  మేమెవరమో తెలిసే  పరిస్థితి  లేక పోయింది. బెడ్ బగ్స్  అంటారే  కాని  ఎలా గుంటామో తెలియదు వారికి. పాత తరం  వృద్ధులు  మమ్మల్ని  ఎప్పటికీ  మరిచిపోలేరు. వాతావరణ  పరిస్థితులా  లేక  మరేమి  కారణమో ప్రపంచమంతా మా మానల్లి జాతి  పూర్తిగా  నశించి  పోయింది. పునర్జన్మ  లభించి  ఎలాగో  నేను  జీవశ్ఛవంలా  అందరికీ  దూరంగా బతుకుతూంటే  మీ సిబ్బంది   నన్ను  బంధించి  తీసుకు వచ్చారు. ఇప్పటికైన  నన్ను  నమ్మండి”  అని  తన  ఆవేదన  వెలిబుచ్చింది. నల్లి  దీన గాధ  విన్న  దోమ  జాతులన్నీ  జాలిపడి  నల్లిని దాని సురక్షిత  స్థావరానికి  చేర్చాయి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!