ఓ మంచి ఆలోచన

ఓ మంచి ఆలోచన

– జీ వీ నాయుడు

సామ్రాజ్యం అనే రాజ్యాన్ని సామంతు అనే రాజు పాలిస్తుండే వారు. ఆ రాజ్యం లో వరుసగా ఐదేళ్లు వర్షాలు పడక పోవడం తో కరువు ఆవరించింది. ఆకలి కేకలతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉండి పోయారు. రాజు గారు మంత్రులు, సైన్యాధి పతులను పిలిచి సమావేశం నిర్వహించారు. సలహాలు, సూచనలు ఇచ్చి కరువు భారీ నుండి ప్రజల ను కాపాడాలి అని ఆదేశించారు. మంత్రు లకు, సైన్యాధి పతులకు ఏమీ తోచ లేదు.
ఒక మంత్రి దైర్యం చేసి ” మహారాజా, సమీపంలో ఉండే రాజ్యాలపై దాడులు చేసి aa రాజ్యాలను వశ పరచుకుని, అక్కడి సంపదను తరలించుక వచ్చి మన రాజ్యంలో అందరికి ఆకలి బాధలు తీర్చడానికి సులభం అవుతుంది కదా, ఆలోచించండి, ధన్యవాదములు మహా రాజా ” అని ముగించారు.
రాజు గారు మౌనం గా ఉండి పోయారు. ఈ సలహా ఇచ్చిన మంత్రి పేరు శక్తి బాహుడు.
మరో మంత్రి, పేరు తెలివి జానీడు. ” మహా ప్రభు, మన్నించండి. మన రాణీ అమ్మవారు (రాజు గారి ముద్దుల సతీమణి )పసిడి కాసులు విక్రయిస్తే, బోలెడు పైకం చేకూరుతుంది. ఆ సొమ్ముతో అందరికి ఆకలి తీర్చే భాగ్యం మీకు కలుగుతుంది. తద్వారా మీ కీర్తి ప్రతిష్టలు రాజ్యం లో విస్తారంగా వ్యాపిస్తుంది యోచించ ప్రార్ధన, అమ్మగారు పేరు ఉచ్చరించినందుకు క్షమించండి ప్రభూ ” అని తన మనసులోని మాట ను బయటకు తీశారు..
రాజు గారు మౌనం గానే ఉన్నారు.
మరో మంత్రి పంజా బాహుడు ” మహా ప్రభు ఏమీ ఆలోచన కు రావడం లేదు. అందరు పొలాల్లో ఎవరికీ వారు వ్యవసాయ బావులు తవ్వుకోవాలని ఆదేశిస్తే… నీటి వసతి ఏర్పాటు అవుతుంది. తద్వారా పంటలు పండుతాయి కదా, ఆలోచన చెయ్యండి ప్రభు. తప్పుగా చెబితే క్షమించండి మహా ప్రభు గారు ” అంటూ ఓ సలహా ఇచ్చారు.
రాజు గారు మౌనం వీడలేదు.
సైన్యాధి పతులల్లో భీమ్ చాకర్ లేచి రాజు గారికి సైనిక వందనం చేసి మహా రాజా మీకు నా మనసులోని మాట చెప్పటం నా ధర్మం అనుమతి ఇవ్వండి అని రాజు గారి వైపు చూసారు. రాజు గారు తన మౌనం వీడి ” అటులనే.. వివరించండి భీమ్ జీ ” అని బదులిచ్చారు రాజు గారు.
బీమ్ ” మహా ప్రభు.. రోజు రోజుకు మన రాజ్యం లో ఆకలి కేకలు అధికం అయ్యి, మరణానికి దారితీసే అవకాశా లు అధికం గా ఉన్నాయి. అందువల్ల మీకు అపకీర్తి వచ్చే ప్రమాదం ఉంది. మన దగ్గర ఉండే సైనిక సామాగ్రిని కొంత భాగం పరుగు రాజ్యాలకు విక్రయించి, వచ్చిన పైకం తో అందరికి ఉచితంగా ఆహారం సమకూర్చ వచ్చును… ఒక సారి సహృదయం తో ఆలోచించండి ప్రభూ.. ” అని వివరించాడు.
రాజు గారు అదే తరహా మౌనం. దీంతో అటు మంత్రులు, ఇటు సైన్యాధి పతులు ఏమీ చెప్పాలో బోధ పడక ఆలోచన లో పడ్డారు. ఇంతలోనే టీ బ్రేక్ విరామం అని రాజు గారు ప్రకటించడంతో అందరు కొంత సేపు ఊపిరి పీల్చుకున్నారు.

తిరిగి అందరు సమావేశం అయ్యారు. రాజు గారు ప్రారంభం చేస్తూ ” మీరు అందరు చాలా సూచనలు చేస్తున్నారు. వాటి మూలంగా
మన రాజ్యం నష్ట పో కూడదు. అందుకే నేను మౌనం గా ఉన్నాను. మనం నష్ట పోకుండా, మనకు మేలు జరిగే సూచనలు చెయ్యండి అని ఆదేశించారు.
వెంటనే మహా మంత్రి మహిమ బాహుడు లేచి ‘ ప్రభువులు వారు మన్నించండి. నా ఈ సలహా సముచితం అని భావిస్తే పాటించండి. లేని యడల మన్నించండి. మీరు ఎలాగూ మన రా కుమార్తె కు వివాహం చేయతలపెట్టారు. ఒక చాటింపు వేయిద్దాము.. మా రాకుమార్తె ను పరిణయం ఆడాలంటే, ముందుగా ఆ రాకుమారుడు ఎవరైనను.. మా రాజ్యం లో అందరు శుభిక్షం గా ఉండే లా చుచుకుంటూ.. ఏ ఒక్కరూ ఆకలితో అలమటించ కుండా చేస్తాను అన్నవారికి నా కుమార్తె ను ఇచ్చి వివాహం జరిపిస్తా ను అని ప్రకటించండి. ఒక దెబ్బ కు రెండు పిట్టలు అన్న చందంగా రాజ్యం లో ఆకలి మంట ఉండదు. రాకుమారుడు దొరుకుతాడు. ” అని సలహా ఇస్తారు. ఒక్కసారి రాజు గారు ముఖం లో నూతన కాంతి విరుస్తుంది. రాజు ఒక్క సారి గా ఆ మహా మంత్రి ని కౌగలించుకుని ” శహాభాస్ ” అంటూ కరచాలనం చేస్తారు.
అనంతరం చాటింపు వేయడం, రా కుమారుడే వచ్చి ” రాజుగారికి నమస్కారం చేసి అన్ని షరతలు అంగీకరిస్తున్నా. రేపటి నుంచి ఏ ఒక్కరూ ఆకలితో ఉండరు. ఇది నా శబధం ” అని కార్యక్రమంలో లో కీ వెళ్తారు.. ఒక మంచి ఆలోచన ఎన్నో ఏళ్ల సమస్య లకు పరిస్కారం చూపింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!