మహిళ

మహిళ

రచయిత :: అలేఖ్య రవికాంతి

సృష్టిలోని అద్భుతం తాను
ఎన్నో బంధాలను పెనవేస్తూ
గగన జగతిలో వెన్నెల నక్షత్రం తాను
కుటుంబానికి వెలుగునిస్తూ
చల్లని తన ఒడిలో ఓనమాలు దిద్దించే కలం తాను శక్తి తాను
పిల్లల భవితకు దిట్టమైనా పునాది వేసే తొలి గురువు తాను
స్వతంత్ర గడ్డ పై తన స్వేచ్ఛని సైతం కుటుంబ ఉన్నతికై త్యజియించే త్యాగమయి తాను
అన్ని రంగాల్లో సాధికారత దిశగా దూసుకుపోయే తారాజువ్వ తాను
నాటి రాణీవాసపు పట్టం నుంచి
నేటి అంతరిక్షయానం వరకు
అన్ని పదవులలో ఒకటో సంఖ్యలా ముందుంది తాను
ఓనమాల ఒడి నుంచి
రాజకీయ పదవి వరకు
మకుటం లేని మహరాణిలా
ఏలుతుంది తాను
తాను ఓ సకలకళావల్లభి
సుగుణాల గని మహిళ…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!