గరం గరం చాయ్

గరం గరం చాయ్

రచయిత: చంద్రకళ. దీకొండ

గాజు గ్లాసుల్లో గరం గరం
అల్లం చాయ్…
ఆహార అరుగుదలకు ఔషధంగా…!

అలసిన వేళల తెచ్చును నూతనోత్తేజం…
అదేపనిగా తాగితే అనర్థదాయకమే…!

తెల్లవారి చలువతో మనదేశంలోకి అడుగుపెట్టి…
వ్యసనంగా పరిణమించిన తేనీరు…
అతిథి మర్యాదల్లో ఆక్రమించింది
మొదటి స్థానం…!

వేడి వేడిగా పొగలు కక్కుతూ…
ఉదయాన్నే ఉత్తేజాన్ని అందిస్తూ…
పనుల ఒత్తిడిని పక్కకు నెడుతూ…
శ్రమజీవులకు తక్షణ శక్తినందిస్తూ…
తలనొప్పిని తగ్గిస్తూ…
తాగకపోతే వెలితిని కలుగజేస్తూ…
స్నేహానికి,ప్రేమలకు
వారధిగా నిలిచేటి “టీ”…
మెదడుకు తాజాదనాన్ని
కలిగించేటి “టీ”…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!