పశ్చాత్తాపం

(అంశం : “మానవత్వం”)

పశ్చాత్తాపం

రచన:చెళ్ళపిళ్ళ సుజాత

కొత్తగా రాజేష్ తో పెళ్లయిన శిరీష కోటి ఆశలతో అత్తవారింట అడుగు పెట్టింది. ఉహాలోకాల్లో తేలుతూ సినిమాల్లో చూపించినట్లు హీరో హీరోయిన్లా ఉండాలి అని కన్న కలలు ఇక్కడ నెరవేరేలా లేదు అనిపించింది మొదటిరోజే శిరీషకి…..

అత్త మామ తమతో కలిసే ఉండడం సుతారము శిరీషకి నచ్చలేదు. ఇద్దరమే ఉంటే ఆ ఆనందమే వేరు అని భావిస్తున్న శిరీష కి అత్తగారి మంచితనం అసలు అర్ధం చేసుకునే పరిస్థితే లేదు. రోజూ వారిని ఈసడించుకొని..అసహ్యించు కొని సూటిపోటి మాటలతో మనసుని గాయం చేసేది……

కాలచక్రం గిర్రున తిరిగింది కాలం ఎవరి కోసం ఆగదు. శిరీష కి ప్రేగ్నన్సీ వచ్చింది. అయిదో నెల పుట్టింటికి వచ్చింది.సీమంతం ఘనంగా చేశారు.దురదృష్టవశాత్తు తల్లి యాక్సిడెంట్ లో చనిపోయింది. దాంతో శిరీష కి కాలు కింద భూమి కదిలినట్లు అయింది. తనకి తొమ్మిదో నెల వచ్చేసింది. బాగా చికాకు చేసింది. ఈ కబురు తెలియగానే శిరీష అత్తగారు ఆఘమేఘాల మీద శిరీష ముందర వాలిపోయింది. అన్నీ తానై సాకింది. డెలివరీకి కూడా ఎంతో కష్టం అయింది.నా బట్టలు పిల్లాడి బట్టలు ఉతుకుతూ…పత్యం వంట చేస్తూ ఉదయం నుండి రాత్రి వరకు మాకు అన్ని పనులు ఎంతో ఓపికతో చేస్తూ ఉన్న అత్తగారు జానకమ్మ ను చూసి ఒకరోజు శిరీష భోరున ఏడ్చేసింది. తనని క్షమించమని. ఎందుకమ్మా మనమంతా ఒక కుటుంబం మనలో మనకు క్షమాపణలు ఏంటి అనేసింది…
అందం అంటే బయటకు కనిపించేది కాదు. మనసు అందంగా ఉండాలి. అంటే మనిషిలో మానవత్వం ఉండాలి. మనుషుల మీద అభిమానం ప్రేమ ఉండాలి అదే అసలైన అందం అని తెలుకొని పశ్చాత్తాపం పడింది శిరీష…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!