అక్షరమా! నా ప్రాణమా

అక్షరమా! నా ప్రాణమా

అంశం: నిన్ను దాటిపోగలనా

నా అక్షర మిత్రమా!
నా కలము హలముగా

సాహితీ సౌరభాల
సమీక్షా సమీరాలను
నిజాయితీగా వెదజల్లావు
కవితా కరవాలమై
కరుడుగట్టిన అవినీతిని
చీల్చి చెండాడావు
గజల్ గజ్జెవై
గాయకుల గళసీమన
మారు మ్రోగావు
పిల్లల కథల పిల్లనగ్రోవిగ
పెద్దలలో పసిమనసులని
ప్రేమగా పలకరించావు

నీ సహవాసంతో నేడు నాకు
సాహితీ గగనాన విజయవిహారం
అక్షరమా! నా ప్రాణమా!!
ఎంత ఎత్తుకెదిగినా
నిన్ను దాటిపోగలనా?
నీ నీడని మాత్రమేగా నేను.

రచయిత ::  గుడిపూడి రాధికారాణి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!