నయగారమా

నయగారమా

అంశం : నిన్ను దాటి పోగలనా

కోలకన్నుల కోమలి
కవ్వించకే కమలాక్షి
సరస సల్లాపాలలో
సమరము సలుపకుమా.

మనసును మైమరపించి
మరులుగొలిపి మాయమైపోకుమా
మందార మకరందమా….

ముద్దబంతిపువ్వులా
ముద్దొస్తున్నావు ముట్టుకుంటే
ముడుచుకుంటావు..

నట్టింట నడయాడు
నయగారమా..
సరస సరాగ
సుమధుర సంగీత
సాహిత్యమైరావా…

నీ పారాణి పాదాలు
నా మదిని మీటి
నా మనసును
మధిస్తున్నాయి…

మగని మదిలో
మలయమారుతమా
మనసునుదోచిన
మందారమా…

కలిసిఉండాలి ఇలాగే మనమిద్దరం కలకాలం
నీవే నేనుగా నేనే నీవుగా
నాలో నీవుగా నీలో నేనుగా, నిను దాటి పోగలనా లలన…

రచయిత :: సరిత రవిప్రకాశ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!