ధరణిలో దైవాలు

ధరణిలో దైవాలు

రచన::నెల్లుట్ల సునీత

స్థితి కోల్పోయిన దేహంలో
చలనం లేని అవయవాలకు ఔషధనైవేద్యం సమర్పించే వైద్యంతో తెల్ల కోటు వెనక తెలియని కష్టాలు జీవితమంతా సంజీవినీతో సహవాసం//

గడియ ఘడియ గడియారంతో పోటీ
గడియ వేయకుండా గండం బాపే యోధులు//
కన్నతల్లి మర్మ మెరిగిన యోగులు
యముడితో పోరాడే ప్రాణదాతలు//
ముక్కోటి దేవతల ముమ్మారు రూపం//

అనువంత క్రిమి సంచారంతో ఓడిపోతున్న
ఆయువుకు ప్రాణ వాయువుతో పునర్జన్మ నిచ్చిన పునీతులు//

ధారాళంగా వైద్య శస్త్ర చికిత్సలో శాస్త్రవేత్తల అస్త్రాలందించే ఆపద్బాంధవులు//

మానవసేవే మాధవ సేవ అని
పరమావధిగా తలచి వైద్య సేవలే వర్ధిల్లి మరణ వేదనను వేదంలా వల్లించే పురోహితులు//
తల్లి జన్మకు తాళి కొమ్ముకు దీవెనలు ఇచ్చే దేవతలు//
ధరణి లో వెలసిన దేవతలే డాక్టర్లు ధన్వంతరి వారసులు //
వారి సేవలే సమాజంలో శ్లాఘనీయం//

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!