సిపాయి! రావోయి!

సిపాయి! రావోయి!

రచన::బి హెచ్.వి.రమాదేవి

సిపాయి! వస్తున్నావు కదా!
నిను కట్టుకున్నప్పుడే,
దేశ గౌరవాన్ని వలువగా,
ఒంటికి చుట్ట బెట్టు కున్నా!

వీరుని భార్యకు వినూత్న
ఆశయాలు,ఆశలు ఉండాలని,
నీ మీసంలో గర్వపుమెరుపులు
నా సింధూరం కు చేరాలని,

నీకండలు తిరిగిన శరీరం,
నాగుండె ను తాకినపుడు,
భరతమాత ను కౌగిలించు
కొన్న ఓ అద్భుత అనుభూతి!

నీవు నాగురించి చింతించకు!
నీ కర్తవ్య దీక్షలో కూడానేను ,
నీ పౌరుష ప్రతిరూపాన్ని!
నీ వీరత్వం నాకడుపులో

ప్రణవంలా ప్రాణం పోసు కునీ
అమ్మా! అని గాక భారతమ్మ!
అంటూ అభిమన్యుని లా
పలవరిస్తుంది సైనికుడా!

నీవు ఎలా వచ్చినా తట్టుకుంటూ నిలవడానికి
గుండె గులాబీ సిద్ధం! రతీదేవిలా యుద్ధం చేస్తా!

యశ్వంత్ వో, యశస్వి వో
యేమైనా వీరపత్నిని,
వర్షించచడానికి,కలువల
కన్నులు వెచియున్నాయిరా!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!