ఆత్మస్థైర్యం

ఆత్మస్థైర్యం

రచన: పిల్లి.హజరత్తయ్య

భగవంతుడు గులాబీ చెట్టుకు
ముళ్ళు ఉంచాడని భావిస్తారు కొందరు
దేవుడి సృష్టిని చూసి ముళ్ళ చెట్టుకు
గులాబీలు పూయించాడని ప్రశంసిస్తారు ఇంకొందరు
చూసేవాడి దృష్టికోణాన్ని బట్టి దృశ్యం గోచరిస్తుంటుంది
అందుకే వీలైతే దృశ్యాన్ని మార్చాలి
లేదంటే దృష్టికోణాన్ని మార్చాలి
సమస్యకు భయపడి సాగితే చిన్న విషయం
పెనుభూతంలా మనల్ని భయపెడుతుంది
సర్వశక్తులు పోసి సమస్యతో పోరాడితే
పెనుభూతమైన మన ముందు  ఓడి తీరుతుంది.
మనలో ఆత్మవిశ్వాసం లోపిస్తే
పిల్లి కూడా పులిలా భయపడుతుంది
అదే ఆత్మవిశ్వాసంతో పోరాడితే
పులి అయినా తోక ముడుస్తుంది
మన ఆత్మ ధైర్యమే మనకు రక్ష
మన ధైర్యమే మనకు శ్రీరామరక్ష
భగవంతుని ఆశీస్సులే అస్సలు రక్ష..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!