వృద్ధాప్యం

వృద్ధాప్యం

రచన: ఐశ్వర్య రెడ్డి గంట

వృద్ధాప్యం తరతరాలకు మూలాధారం
అనుభవాల చరిత్ర పుస్తకం

మనసు నిండా ప్రేమ తో
మనల్ని దీవించే ప్రేమామృతం వృద్ధాప్యం

కష్టాల కడలిలో జీవితాన్ని సాగించి
సుఖాలు ధారపోసే సంజీవని వృద్ధాప్యం

మనల్ని నీడలా కాపుకాసి
వెన్నంటి ఉండి కాపాడే ధైర్యం వృద్ధాప్యం

పరువు ప్రతిష్ట కుటుంబ గౌరవానికి
మూల స్తంభం వృద్ధాప్యం

ముసలి తనాన బోసి నవ్వుల పాపాయిలై
మనతో బ్రతికే దేవతా స్వరూపం వృద్ధాప్యం

మన పిలుపుకు మురిసిపోయే
పసితనం  వృద్ధాప్యం

మమతలు పంచిన చేతులు
ముడుతలు పడిన వేళ
అందించుదాం ప్రేమగా  హస్తం

రక్తాన్ని దారపోసి శారీరకంగా మానసికంగా
అలసిన మనసులకు ప్రేమను పంచి
పసిపాపలల సాకుదాం.

బంధానికి బరువు కాకుడదు వృద్ధాప్యం
వారి సేవనే  వరంలా  స్వీకరించుదాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!