కాలుష్య కోరలు

కాలుష్య కోరలు

రచన : వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

ప్రభాత సమయాన్న ఉత్సాహంతో ఉదయించే భానుడు,
మధ్యాహ్న సమయాన ప్రజ్వరిల్లే,
ప్రాతఃసమయాన గ్రీష్మ తాపంతో అలిసిపోయి,
చంద్రుని రాకతో సూర్యదేముడు ఉపశమించే!
చంద్రుని చల్లని రాకతో లోకామెల్ల సంతసించే,
పగలంతా కష్టపడిన ప్రజానీకం సేదతిరే సమయమిదే,
పున్నమి వెలుగులుతో మిలమిల మెరిసే సంద్రపు కెరటాలు,
ఉవ్వెత్త్ న ఎగిరిపడుతూ  మనసు ఆహ్లాదపరిచే,
మానవ,పసుపక్షి జాతులు విశ్రాంతి పొందే తరుణమిదే.
కనుక మానవులారా,వృక్ష జాతిని,పచ్చని అడవులను,కొండలను తెగనరికి
ఆధునీకరణ అన్న నెపంతో,మన చక్కనైన సూర్యోదయాలు,చంద్రోదయాలు కనపడకుండా
కాలుష్య విష సర్ప పడగలు మింగేయకుండా కాపాడండి,
మానవజాతి మనుగడ కోసం శ్రమిద్దాం, వృక్షజాతిని సంరక్షిద్దాం.!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!