ఆమె స్పర్శలో మాయ
రచన: బుజ్జమ్మ
మనో సంద్రం ఉప్పొంగుతుంది..
మాటలు మౌనంలోకి వెళ్లిపోయాయ్
ఆలోచనలు పిచ్చెక్కిస్తున్నాయ్
పదాలు నా వైపే రానంటున్నాయ్
ఇక అక్షరం అలిగి కూర్చుంది
కారణం లేని క్షణికావేశం
మనసంతా ఆగమాగం ఉంది..
నా నేస్తనికి చెప్తే నవ్వింది.. మరీ
చిన్నపిల్ల అవుతున్నావే నువ్వు అని
అంతే… అమ్మ గుర్తు వచ్చింది
ఆమె పక్కన పడుకున్నా..
ఆ తర్వత ఏమైందో చెప్పాలా ఇక..
లోన దాగినదేదో.. తెలీదు.. కానీ..
మనసంతా.. దూది పింజలా అయింది..!!