జ్ఞానం అంటే?

జ్ఞానం అంటే?
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : ఎం. వి. ఉమాదేవి

నేటి రోజుల్లో ఎవరికి చూసినా అంతా మాకే తెలుసు అనే అజ్ఞానం తప్పకుండా ఉంటుంది. అన్నీ తెలిసిన వాళ్ళు ఎక్కువగా మాట్లాడరు. చేయాల్సిన పని మాత్రమే చేసి మెప్పు అందుకుంటారు. కొందరు ఎక్కడకు వెళ్లినా స్వభావం మార్పు అనేదే ఉండకుండా పచ్చి స్వార్థంతో వ్యక్తి స్వేచ్ఛ ముసుగులో మాట్లాడుతూ అవతల వారిని చాలా బాధ పెడుతున్నారు. మాకు తెలిసిన వాళ్ళ కుటుంబంలో గంగాభాగీరథీ సమానురాలైన పెద్దావిడ శివైక్యం చెందారు. ఆవిడకు ఒక్కటే కూతురు. ఆమెకు, మూడు తరాలకు ఆ మామ్మ గారి సేవలు సాటిలేనివి. కుటుంబం మొత్తం దుఃఖసముద్రంలో ఉన్నారు. కూతురు అలా నిస్తేజంగా ఉంది. పిల్లలు ఏదో వండి, వచ్చిఉన్న చుట్టాలకు పెడుతున్నారు. భోజనాలు సమయంలో పప్పు చారు, పచ్చళ్ళు, పెరుగు చూసి ఒకాయన “ఏమిటి ఈ భోజనం? ఒక్క కూర లేదు, అప్పడాలు అయినా లేవు. ఎలా తింటాము అనుకున్నారు? “అనేశాడు. అందరికి పట్టరాని కోపం వచ్చింది. అతన్ని వారించకుండా భార్య కూడా అదే ధోరణి.
వాళ్ళు ఆ ఊరి వాళ్ళు. వెళ్లి కావాల్సిన రాజభోజనం హోటల్ నుండి తెప్పించుకుని తినొచ్చు కదా. మనిషి పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వాళ్ళతో ఇలా ప్రవర్తన చాలా హేయం. పుట్టింది తినడానికి, సుఖం అనుభవం కోసమే కాదు. మానవత్వం అనేది ఉండాలి. ఒక్క కాకి చనిపోతే వందల కాకులు శోకిస్తూ ఆకాశంలో గిరికీలు కొడుతాయి. అటువంటిది కేవలం రుచులు కోరుకుంటూ బ్రతికి ఏమిటి జన్మ లో అందుకున్న జ్ఞానం? అనుభవించు రాజా అని బ్రతికి ఏదైనా కష్టం వస్తే ఎదుట వాళ్ళనే కారణంగా దుమ్మెత్తిపోసే వాళ్ళు చివరి దశలో దుర్భర జీవితం చూస్తారు. పైకి ధర్మ దాతలా కనిపించడం కాదు. నిత్యం ఆవునెయ్యి దీపారాధన లూ, సాయి గుళ్లో వేల రూపాయలు కట్టాం అని చెప్పుకోవడం కాదు. ఏ పరిస్థితిలో మనం ఎలా ప్రవర్తన చేయాలి అనేది తెలిసిన వాళ్ళని దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. నాస్తికులు కూడా ధర్మం తప్పరు. కుహనా భక్తులు ఇలాంటి ప్రవర్తనలో ఉంటారు. అదే గమనించి బుద్ధి చెప్పేవాళ్ళు ఉండాలి. అమాయకులని బాధలు పెడితే అది ఈ జన్మలోనే తగులుతుంది. కలియుగం ధర్మం !

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!