చిన్ననాటి సందడి  

చిన్ననాటి సందడి   
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సుజాత కోకిల

ఈ రోజంతా చాలా సందడిగా వుంది రేపు ఫిఫ్టీంత్ ఆగస్ట్ మా క్లాస్ రూమ్ డెకరేషన్ చేయాలి. రంగు రంగు పేపర్లని తెచ్చి వాటిని డిజైన్‌గా కత్తిరించి  క్లాస్ లో అందంగా అతికించాలి. అప్పుడు మేము ఎంత   హైరానాపడి ఎంత సరదా చేసేవాళ్లం, అమ్మో అప్పుడు ఈ రోజులలో లాగాకాదు ఇప్పుడు గమ్ బాటిల్స్ తో అంటిస్తారు. అప్పుడు అలా కాదు! అప్పుడు గమ్ బాటిల్స్ ఉన్నాయని కూడా తెలిసేది కాదు! అన్నంతో అతికించే వాళ్ళం. పెద్ద పెద్ద గిన్నెలో ఉడికించి తెచ్చేవాళ్లం. ఆ రోజులు చాలా బాగుండేవి. ఆగస్టు పదిహేను వచ్చిందంటే చాలు ఎంత హడావుడి ఉండేది. ఇంటింటికి వెళ్లి పూలు కోసుకొచ్చి మాలలు అల్లుకొని మన ఇంట్లో ఉన్న ఏదో ఒక చెట్టుపైనే వేసుకునేవాళ్ళం అవి వాడిపోకుండా ఉండటానికి అప్పుడు ఫ్రిడ్జ్లు ఉండేవి కావు బట్టలు ఇస్త్రీ చేసుకోవాలంటే ఎంత తంటాలు పడేవాళ్ళమో మాకు ఇస్త్రీ పెట్టెలు ఉండేవి కావు. ఒక్క చెంబులో నిప్పులు పోసుకుని దానితో స్త్రీ చేసుకునే వాళ్లం వాటిని మళ్లీ తల దిండు కింద పెట్టుకుని పెందలాడే లేచి చల్లటి నీళ్లతో తలంటి స్నానం చేసి గబగబా ఆ బట్టలను వేసుకుని అందరికంటే ముందే వెళ్లేవాళ్లం. అందరు చక్కగా తయారై సీతాకోకచిలుకల్లా అందంగా ఉండేవాళ్లం.
అప్పుడు ఆ రోజులు ఎంత బాగుండేవో అన్ని రకాల ఆటల పోటీలు ఉండేవి. సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా అన్నింటిలో పాల్గొనే వాళ్ళం. జెండావందనం చేసిన తర్వాత స్వీట్స్ పంచేవాళ్ళు. పోటీల్లో పాల్గొన్న వాళ్లకి ప్రైజులు ఇచ్చేవాళ్లు స్కూల్ నుండి ఇంటికి వెళ్లే వాళ్లం కాదు. సరదాగా ఫ్రెండ్స్ ఇండ్లల్లోకి వెళ్లి సరదాగా ఎంజాయ్ చేసి లంచ్ టైమ్కు ఇంటికి చేరుకునే వాళ్ళం. అయినా మా పెద్దవాళ్ళు ఏమనేవారు కాదు ఎందుకంటే ఆ రోజులు అలా ఉండేవి. ఆడమగ అనే తేడాలు లేవు అందరం సరదాగా ఆడుకునే వాళ్ళం, ఏ అరమరికలు లేని అమాయకత్వం ఉండేది. సరదాగా కనిపించేది. ఇప్పుడు అలా కాదు అప్పటి ఆటలంటే తెలియవు ఇప్పుడున్న పిల్లలకు. స్నేహితులు లెేరు, సరదాలు లేవు, సెల్ఫోన్లు తప్ప వేరే ప్రపంచం తెలియదు ఈ పిల్లలకి ! అప్పటి స్నేహాలు ఆ జ్ఞాపకాలు ఇంకా గుర్తుకు వస్తూనే ఉన్నాయి. ఇలా ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచిపోయాయి. అంటే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడే ఆడిపాడినట్టుగా ఉంది గతం! గెట్టు గెదర్ పార్టీ ఎవరు కనిపెట్టారో కాని, వారికి ధన్యవాదాలు ఇంత కాలానికి కూడా అందరం కలుసుకోవడం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, ఎంత బావుందో ఏ అరమరికల్లేని స్నేహాలు, చిలిపి దెబ్బలాటలు దొంగతనంగా జామచెట్టెక్కి జామకాయలు కోసుకోవడం, తోటమాలి వచ్చి అరవడం గబుక్కున పరుగెత్తడం కింద పడుతూ లేస్తూ పరుగెత్తడం, మోకాళ్ల చిప్పలు పగలడం, హ..హ ఆ ఆ రోజులు? ఒకరినొకరు దెబ్బలాడుకోడం, మొట్టికాయలు అవన్నీ గుర్తుకు వస్తే చాల నువ్వు వస్తుంది. ఇదండి మా చిన్ననాటి స్టొరీ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!