ఆధార్ కార్డ్ (కథాసమీక్ష)

ఆధార్ కార్డ్(కథాసమీక్ష)

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: నారు మంచి వాణి ప్రభా కరి

కథ: ఆధార్ కార్డ్
రచన: నారు మంచి వాణి ప్రభా కరి

ఈ కథ ఏ ఒక్కరి సమస్య కాదు. దేశ సమస్య ఎడమ చేత్తో ఇచ్చి కుడి చేత్తో పుచ్చుకున్నట్లు ఉంది.
చాలా మందికి వేలిముద్ర పడటం లేదు KYC కోసం వెడితే అక్కడ లెక్క లేనంత మంది ఉన్నారు శ్రావణి తల్లి కోసం కని పెట్టుకుని ఉన్నది. కొడుకు ఎక్కడో ఉన్నాడు ఈ రోజుల్లో కూతురే చూస్తోంది. తల్లికి వెలి ముద్ర పడదు కూతురికి పడదు, తల్లికి కళ్ళకి ఫోటో తీసి పెన్షన్ ఇస్తారు. కూతురికి రేషన్ లో ఇవ్వడం లేదు కారణం కే వై సి లేక పోవడమే అప్లై చేసిన నాలుగు నెలలు అయింది ఇంకా రాలేదు.
ఇండియన్ బ్యాంక్ సెంటర్ లో అయితే మంచిదని KYC చేయించినా ఇంకా ఈ సేవకు రాని వారు ఎందరో ఉన్నారు. ఈ ముద్ర పడక అదే బియ్యం పెన్షన్ పై ఆధార పడ్డ వారి పరిస్తితి ఏమిటి? దేశంలో ఇది చాలా అల్ల కల్లోలంగా ఉన్నది.
ఈ అంశాన్ని బాగా చక్కగా చెప్పడానికి ఈకథ ఎంతో స్పూర్తి దాయకం అని చెప్పాలి. ఇది నిజ జీవితానికి అద్దం పడుతుంది ప్రతి ఇంటిలో ఈ సమస్య ఉన్నది చాలా మందికి రేషన్ రాక తంటాలు పడుతున్నారు.
జీవిత సత్యాలు ఈ కథలో అద్భుతంగా చిత్రీకరించి పాఠకులకు అందించారు. కథ అనేది నిజానికి జీవిత అంశాలు తెలిపేదిగా ఉంటే చదివే తప్పుడు కథ కథనం, ఆసక్తిగా ఉంటుంది. ముగింపు ఏవిధంగా ఉండాలి, ఎత్తు గడ ఏవిధంగా ఉంటే మంచిది అన్నది ఆలోచించి సమకాలీన సమస్యల కు ఆధారంగా ఈ ఆధార్ కార్డ్ కథ సృష్టించి నిజ జీవిత సత్యాన్ని చూపిస్తూ హృద్యంగా రాశారు.
రచయిత్రి సామాజిక సమస్యకు అద్దం పట్టి చక్కని అంశాన్ని అందించారు. ఆకలి అందరికీ ఉంటుంది. కానీ రేషన్ అందరికీ అందడం లేదు డబ్బు అవసరం అందరికీ ఉంటుంది కానీ పెన్షన్ సమయంలో ఎన్నో సమస్యలు తప్పడం లేదని ఈ కథ జీవిత సత్యాన్ని చెపుతోంది
మరి మీరు ఏమంటారు?

ఆధార్ కార్డు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!