పరమానందయ్య శిష్యుల కథ

పరమానందయ్య శిష్యుల కథ (పుస్తక సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

సమీక్షకులు: మాధవి కాళ్ల

పుస్తకం: పరమానందయ్య శిష్యుల కథ
రచన: ఇందిర సుబ్రహ్మణ్యం

ఒక గాంధర్వ కన్య పరమానందయ్య శిష్యులు కి శాపం ఇచ్చింది.. ఇవ్వడం వల్ల మంద బుద్దులు గా మారిపోయారు. ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ పరమానందయ్య ఆశ్రమానికి చేరుతారు. వాళ్లకి నామకరణాలు చేశారు. ఒకరోజు పక్క ఊరికి శిష్యులందరూ వెళ్లారు అయితే దార్లో ఒక వాగు దాటాల్సి వచ్చింది.. వాగు  నిద్ర పోయిన తర్వాత వెళ్దాం అని అనుకుంటారు ..  వాగు నిద్ర పోయిందో లేదో అని ఎలా తెలుసుకోవడం అని  ఒక శిష్యుడు తన సందేహం  చెపుతాడు. మరొక శిష్యుడు రాత్రి పూట వాగు  దాటుతాము అని చెపుతాడు.. వాగు దాటిన తరువాత ఒక శిష్యుడు అందరూ వరుసగా నిలబడండి అని చెప్పి ఆ శిష్యుడు అందరిని లెక్క పెట్టాడు.. 11 మంది వస్తున్నారు. మళ్ళీ మరొక శిష్యుడు లెక్క పెట్టాడు మళ్లీ 11 మంది వస్తున్నారు.. తరువాత అందరూ గురుగారు దగ్గరకు వెళ్ళి విషయం మొత్తం చెప్పారు .. అప్పుడు గురూ గారు ఒక శిష్యుడు పిలించి లెక్క పెట్టమని చెప్పారు అప్పుడు కూడా 11 మంది వచ్చారు.. అప్పుడు గురూ గారు తనని తను లెక్క పెట్టుకోలేదు అని చెప్పారు. కాసేపు సంతోషంగా నవ్వుకోవచ్చు.. మంద బుద్ధి తో గురూ గారిని కొంచం ఇబ్బందిపెట్టతారు..  ఒకరోజు గురు గారికీ ఒంట్లో బాగాలేదు. గురుపత్ని గారు కషాయం తయారు చేయడానికి మసాలా దినుసులు తీసుకురావడానికి పంపించు శిష్యుల్ని మార్కెట్కి.. శిష్యులందరూ మార్కెట్ కి వెళ్లి మసాలాదినుసులు సగం తీసుకు వచ్చారు.. గురుపత్ని కి కోపం వచ్చి బాగా తిట్టారు శిష్యుల్ని..పరమానందయ్య గారి కి  ఇంకా జ్వరం ఎక్కువ అవ్వడం వల్ల  శిష్యుల్ని వైద్యుడిని తీసుకొని రమ్మని చెప్పారు గురుపత్ని.. వైద్యులు వచ్చి పరమానందయ్యగారి నాడీ సరిగ్గా చూడకపోవడం వల్ల చనిపోయారు అని వైద్యుడు చెప్పాడు అప్పుడు శిష్యులు ఓరి దేవుడో మా గురువు గారు చనిపోయారే అని ఏడుస్తూ ఉన్నారు. పక్కనే గురుపత్ని కూడా ఏడుస్తున్నారు..  పరమానందయ్య గారిని స్మశాన వాటిక తీసుకొని వెళ్లారు ఆ తర్వాత పరమానందయ్య గారికి మెలకువ వచ్చి లేచి కూర్చున్నారు శిష్యులందరూ చూసి గురువు గారి ఆత్మ వచ్చేసింది అని భయపడతారు గురుపత్ని వచ్చి మీ గురువు గారు బతికే ఉన్నారని చెప్పారు..  ఈ విషయం తెలుసుకున్న జనాలు ఒకటే నవ్వు .. శిష్యులు తెలివి తేటలకు.. మరొకసారి శిష్యులందరిని గురు గారు ప్రశ్నలు అడుగుతాను. దానికి మీరు జవాబు చెప్పండి అని చెప్పారు పరమానందయ్య గారు. ఒక శిష్యుడు పట్టు శాలువా, చీపురుకట్ట తీసుకొని వచ్చాడు.. అవి ఎందుకు తీసుకొని వచ్చావు అని అడిగారు పరమానందయ్య.. అప్పుడు ఆ శిష్యుడు  మీరు అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పితే పట్టు శాలువా తో సత్కకరించాలి లేదా తప్పు చెప్పితే చీపురు కట్ట తో చిత్కకరించాలి అని చెప్పాడు.. శిష్యులు అందరూ సరైన జవాబులు చెప్పారు.. తరవాత గురు గారికి అడిగితే జవాబు చెప్పలేదు అప్పుడు శిష్యులు అందరూ చీపురు కట్ట తో చిత్కకరించారు. అప్పుడు గురుపత్ని వచ్చి శిష్యులకు బుద్ది చెప్పింది.

You May Also Like

One thought on “పరమానందయ్య శిష్యుల కథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!