కళ్ళు వెళ్లిన చోటుకు మనసు వెళ్ళకూడదు
శుభలగ్నo (మూవీ రివ్యూ)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షకురాలు: విస్సాప్రగడ పద్మావతి
చిత్రం: శుభలగ్నo
కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: ఎస్ వి కృష్ణారెడ్డి
నేపథ్యం: ఈ సినిమా మధ్యతరగతి కుటుంబ నేపథ్యం. మధ్యతరగతి స్త్రీ మనోభావాలు, డబ్బు పై ఉండే ఆసక్తి, వ్యామోహం కథను ముందుకు నడిపించాయి. అత్యాశ ,దురాశ వలన జీవితాలు ఏ విధంగా తారుమారు అవుతాయో కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన విధానం చాలా అద్భుతంగా ఉంది.
విషయం: నీతి, నిజాయితీలకు కట్టుబడి పనిచేసే మధ్యతరగతి యువకుడు హీరో. అతని భార్య అందని పళ్లకు అరుల్లు చాస్తూ అందరి కన్నా ఎత్తులో ఉండాలని, డబ్బుకు యేలోటు ఉండకూడదని, డబ్బుపై వ్యామోహంతో లేని పోని దాబులకు పోతూ ఉంటుంది. ఇద్దరు పిల్లల తో తీరని కోరికలతో డబ్బు కోసం భర్తను లంచాలు తీసుకోమని వేధిస్తూ ఉంటుంది తాను ప్రశాంతంగా ఉండక తన భర్తని ప్రశాంతంగా ఉంచక ప్రతిరోజు కాల్చుకు తింటూ ఉంటుంది. ఎంతో ఓర్పు సహనం కలిగిన భర్త భరిస్తూ తాను లంచాలు తీసుకొనని ఇలాగే ఉంటా అని నొక్కి వక్కాణిం చేసరికి చేసేదిలేక తనలో తనే మదనపడుతూ ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో హీరోకు రోజా తారసపడుతుంది మొదటి చూపు లోనే హీరో పై ఒక అభిప్రాయానికి వచ్చి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది. చేసేది లేక తండ్రి సరే చెప్తాడు.. హీరో భార్య కి డబ్బు ఆశ చూపించి కోటి రూపాయలు ఇచ్చి తన భర్తను పెళ్లి చేసుకుని సుఖంగా కాపురం చేస్తుంది. కోటి రూపాయలు కళ్ల ముందు కనిపించే సరికి తను ఏం కోల్పోయిందో గ్రహించక, డబ్బు మోహంలో పడి ఇవేమీ పట్టించుకోదు. సరదాలు షికార్లు క్లబ్బులు అంటూ కాలక్షేపం లో మునిగి పోతుంది. ఇంటి బాధ్యత అంతా రోజా తీసుకుని అనుకువగా మెలుగుతుంది. ఆమని స్నేహితురాలు సుహాసిని. సుహాసిని తన భర్త ఆరోగ్యం కోసం తన బంగ్లా అమ్ముకుని ఆమని ఇల్లు కొనుక్కుని ఆ ఇంట్లోకి మారుతుంది.
అనుకోని పరిస్థితుల్లో ఒక రోజు ఆమనికి సుహాసిని తారసపడుతుంది. నా దశ చూశావా ఎలా తిరిగిందో ఇప్పుడు నేను సాధారణమైన గృహిణి ని కాను.. నేను. కోటేశ్వరురాలిని. ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవ్వడం అంటే ఇదేనేమో అని వెటకారంగా ఆమని అంటే. నువ్వు ఎప్పటికీ నా కన్నా గొప్ప దానివి కాలేవు. నేను నా భర్త ఆరోగ్యం కోసం నా బంగ్లా అమ్ముకున్నాను. నువ్వు నీ భర్త ని అమ్ముకుని నా బంగ్లాను కొనుకున్నావు. నాకంటే నువ్వు ఎప్పటికీ గొప్ప దానివి కాలేవు అంటుంది. డబ్బు వ్యామోహంలో పడిన ఆమె ఇదేమీ పట్టించుకోకుండా తన కాలక్షేపాల్లోతను ఉంటుంది.
ఒకరోజు తన పెళ్లి రోజు వస్తుంది. తన పెళ్లి రోజు తనతో గడపడానికి తన భర్త సిద్ధంగా ఉండకపోవడం చూసి భర్త కోసం ఎదురు చూసిన ఆ క్షణం తనకు అర్థం అవుతుంది తాను ఏం కోల్పోయిందో. రోజాను ప్రాధేయ పడుతోంది తన భర్తను అచ్చంగా ఇచ్చేయమని దానికి రోజా ఒప్పుకోదు. భర్తనీ అడుగుతుంది వచ్చేయమని. నువ్వు నన్ను అమ్మావు. ఆవిడ కొనుక్కుంది. భర్తగా తన వైపు ఉండడమే న్యాయం అని అనేసరికి చేసేదిలేక న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తుంది. కోర్టు కూడా తనకు అనుగుణంగా తీర్పు ఇవ్వక పోయేసరికి వ్యాకులత చెందుతుంది. ఇదంతా గ్రహించిన రోజా తాను చేసిన తప్పును గ్రహించి కళ్ళు వెళ్ళిన చోటకి మనసు వెళ్ళకూడదు..మనసు వెళ్లిన చోటికి మనిషి వెళ్ళకూడదు అని తన భర్తను పిల్లల్ని అప్పగించి లండన్ వెళ్ళిపోతుంది.. ఆమని తన భర్త, పిల్లలతో సుఖంగా మధ్యతరగతి జీవనం లోనే సంతోషంగా ఉంటుంది.
మంచి సినిమాకి మంచి సమీక్ష. బాగుంది