జై భీమ్

“జై భీమ్” (చిత్రసమీక్ష)
మనసును కదిలించే చిత్రం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకులు: ఎన్.ధన లక్ష్మి

చిత్రం: జై భీమ్‌
రచన,దర్శకత్వం: త.శె.జ్ఞానవేల్‌

కొన్ని సినిమాలు చూస్తున్నంతసేపు తెలియకుండానే కంట్లో నుండే కన్నీరు వస్తుంది.. కొన్ని సీన్స్ కి అయితే విజిల్ వేయాలి అనిపిస్తుంది(నా దగ్గర లేకపోయినా సరే తెచ్చుకొని మరి పెట్టుకున్న వేయడానికి). క్లైమాక్స్ చూస్తే ఆటోమేటిక్ పెదాలపై చిరునవ్వు వచ్చేస్తుంది. ఇలాంటి అన్నీ భావోద్వేగాల సమ్మేళనం “జై భీమ్” మూవీ”.
కడలూరు జిల్లా, కమ్మం గ్రామంలో కూలి పనులు చేసుకుని బ్రతికే గిరిజనుల జాతికి చెందిన వారు రాజన్న, అంతే కాదు ఆ ఊరిలో ఎక్కడ విషపూరిత మైన పాములు కనపడ్డ సరే పట్టీసి అడివిలో వదిలిపెట్టి కష్టపడి పని చేసుకుంటూ ఉన్నంతలో  భార్య చిన్నతల్లి,కూతురు లక్ష్మి తో కలిసి ఆనందంగా  జీవిస్తుంటారు.
ఆ ఊరిలో పెద్దవారు అయిన ఒకరి ఇంట్లో పాము దూరితే రాజన్న వెళ్ళి పట్టుకుంటాడు.. ఆ ఇంట్లో   దొంగతనం జరుగుతుంది.ఆ నేరాన్ని కాస్త రాజన్న పై వేస్తారు..పోలీసులు రాజన్న ను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడతారు..గిరిజనుల పై జరిగే ఎన్నో అరాచకాలు ఎంతో నాటకీయంగా అద్భుతంగా చూపించారు.ఆ సీన్స్ చూస్తే చాలు ఆటోమేటిక్ కంట్లో నుండి నీళ్లు వచ్చేస్తాయి. రాజన్న, తన తమ్ముడు,స్నేహితుడు జైల్ నుండి పారిపోయరు అని చెప్తారు పోలీసులు..ఎక్కడ వెతికినా సరే ఎక్కడ కానరారు. అసలు రాజన్న ఏమి అయ్యారు. గర్భవతి అయిన చిన్నతల్లి తన భర్త కోసం చేసే పోరాటమే ఈ “జై భీమ్”మూవీ తనకి ఈ పోరాటంలో లాయర్ చంద్రు ఎలా సాయం చేశారు అసలు రాజన్న ఏమి అయ్యారో తెలుసుకోవాలి అంటే ఈ చిత్రం తప్పక చూడాల్సిందే మీరు  ఇందులో ఒక సీన్లో పోలీసులు కొట్టే దెబ్బలకి తట్టుకోలేక రాజన్న తమ్ముడు, స్నేహితుడు మనం చేసాము అని ఒప్పుకుందాము అంటాడు.
అందుకు రాజన్న” రేయ్! ఈ దెబ్బలు కొద్దీ రోజులకీ మానిపోతాయి..కానీ దొంగ అని ముద్ర మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఎన్ని దెబ్బలు అయిన సరే తట్టుకుని ఉందాము కానీ చేయని తప్పు ఎందుకు ఒప్పుకోవాలి అంటాడు. ఈ సినిమాలో నటించిన నటులు అందరు అధ్బుతంగా నటించారు అనే కన్న తమ పాత్రలలో జీవించారు అని చెప్పచ్చు అసలు. టాప్ హీరో అయిన సూర్య హీరోజం ఎక్కడ కనపడదు..అనవసరమైన సీన్స్ ,ఫైటింగ్స్ సీన్స్ ఇవేమీ కూడా ఉండవు అసలు పాటలు ఉన్న సరే అవి గిరిజనులు గురించి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. పోలీస్ స్టేషన్  వచ్చే సీన్స్ కన్నీరు తేప్పిస్తే ,కోర్టు సీన్స్ ఒక్కొకటి క్లాప్స్ కొట్టేలా,విజిల్ వేసేలా ఉన్నాయి. ఈ మూవీలో డైలాగ్స్ అన్నీ బాగా ఉంటాయి. ముఖ్యంగా లాయర్ చంద్రు గారు తన ఇంట్లో గోడ పై ఒక బోర్డ్ ఉంటుంది అందులో
” ఇక్కడ ఎవరు దేవుళ్ళు లేరు కావున దండలు వద్దు ఇక్కడా ఎవరు వణకడం లేదు కావున శాలువలు వద్దు ఇక్కడా ఆకలితో ఎవరు లేరు కావున పండులు, మిఠాయిలు వద్దు” అని రాసి ఉంటుంది. ఎంత గొప్ప వ్యక్తిత్వం కదా లాయర్ చంద్రు గారిది. ఇది కల్పిత కథ కాదు నిజజీవిత గాథ. తనకి సాయం చేసిన లాయర్ చంద్రు  గారి గురించి ఈ మూవీ తరువాతే చాలా మందికి తెలిసినది. చంద్రు గారి గురించి మరికొన్ని విషయాలు. చంద్రు గారు మద్రాస్ హై కోర్టు జస్టిస్ గా పని చేసి రిటైర్డ్ అయ్యారు. ఆయన పదివి కాలం 2006-2014 అంతే ఈ మధ్య కాలంలో దాదుపు 96,000 కేస్ లకి తీర్పు చెప్పారు. ఇన్ని కేస్ లకి తీర్పును ఇవ్వడం అంత తేలికైన పని కాదు ఎటువంటి రాజకీయ ఒత్తిడిలకి కూడా తను ఏ మాత్రం లొంగలేదు. గవర్నమెంట్ ఇచ్చిన వెహికిల్ ను పనులు నిమిత్తం వాడేవారు..పని అయ్యాక లోకల్ ట్రైన్ లో వెళ్లేవారు, కోర్టులు ఎవరు కూడా మై లార్డ్ అని పిలవకుడదు అని రూల్ పాస్ చేశారు.
రిటైరై అయిన తరువాతే గ్రాండ్ గా ఇచ్చే వింధును తిరస్కరించారు. చంద్రు గారు లాయర్ గా పనిచేసేటపుడు 1993 లో రాజన్న కేస్ తన దగ్గరకి వచ్చింది. ఎక్కువ రోజులు కోర్టులో జరిగిన కేస్ కూడా ఇదే, చంద్రు గారు ఎక్కువ మానవ హక్కుల మీద,గిరిజనుల గురించి సంబధించిన వాటిని వాదించేవారు. అది కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. చంద్రు గారు నడుపుతున్న ఎడ్యుకేషన్ ట్రస్ట్ కి హీరో సూర్య గారు కోటి రూపాయలు విరాళాలు ఇచ్చారు. డైరెక్టర్ జ్ఞానవెల్ గారి పేపర్ లో చంద్రు గారు గురించి  రాసిన ఆర్టికల్ చదివి మొదట డాక్యుమెంటరీ తీయాలి అనుకున్న సూర్య గారు ముందుకి వచ్చి నిర్మాతగా ,హీరోగా  బయోపిక్ మూవీ గా ముందుకి వచ్చింది.
ఈ మూవీలో చిన్నతల్లీ లాయర్ చంద్రుతో “సార్ మీకు డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర బంగారు తాళి తప్ప ఇంకొకటి లేదు. ఇది చేయించడానికి మా ఆయన కష్టపడ్డారు. ఇది అమ్మి మీకు డబ్బులు ఇస్తాను అంటుంది” అందుకు లాయర్ చంద్రు “నేను పుట్టినప్పుడు లాయర్ గా పుట్టలేదు అమ్మ, మనిషిగ పుట్టాను అమ్మ మన దగ్గరా ఉన్న ప్రతిభ నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. మీలాగే బాధింపబడిన వారికి న్యాయం జరిగి , మీ మోహంలో వచ్చే చిరునవ్వే నాకు అసలైన ఫీ అంటారు. అప్పుడే నేను మనశ్శాంతిగా నిద్ర పోతాను అని చెపుతారు. క్లాప్  కొట్టాలి అనిపిస్తుంది ఈ సీన్స్ చూస్తే. అసలు ఈ మూవీకి జై భీమ్ ఎందుకు పేరు పెట్టారు అనేది ఈ మూవీ చివర్లో మరాఠీ కవి విలాస్ పెడులరే రాసిన కవితను చూపిస్తారు.
“జై భీమ్ అంటే కాంతి
జై భీమ్ అంటే ప్రేమ..
జై భీమ్ అంటే చీకటి నుండి వెలుగు వైపు ప్రయాణం
జై భీమ్ అంటే కోట్లాది ప్రజల కన్నీటి చుక్క”
అమెజాన్ ప్రైమ్ ఆర్ ibomma. com  లో ఈ సినిమాను చూడవచ్చు. ఈ మూవీని చూసి చాలా మంది అభిమానులు గిరిజనులు ఉండే ప్రదేశాలకు వెళ్ళి నిత్యావసర సరుకులు అందచేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ గారు సామాజిక మాధ్యమాల్లో ఒక విడియో చూశారు.అందులో  ఒక దళిత మహిళ తన పై గుడిలో జరిగిన అవమానాన్ని  ఎలా ఎదుర్కొందొ చూసిన అయన ఆమె ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పడం కాక ఆ ఏరియా లో ఉండే వారి అందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా  చేశారు. చీఫ్ సెక్రటేరియట్ తమిళనాడు లోని అన్ని జిల్లాల కలెక్టర్లుకు గిరిజనులకు సక్రమంగా పథకాలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.” నిజాయితీ,సంకల్పం బలం ఉండాలే కానీ ఎంతటి కష్టాన్ని అయిన సరే ఓర్చుకొని విజయాన్ని సాధించగలమని ఈ మూవీ తెలియజేస్తుంది”.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!