భక్త కన్నప్ప

భక్త కన్నప్ప(చిత్ర సమీక్ష )
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

సమీక్షకులు: యాంబాకం

చిత్రం: భక్త కన్నప్ప
దర్శకుడు: బాపు గారు

అర్జునుడు పాశుపతాశ్రం “కొరగా శివుని గురించి ఘోర తపస్సు చేయగా శివ పార్వతులు శివతాండవం చేయువేళ అర్జునుడి తపస్సు జ్వాలలు కైలాసం చేరగా శివపార్వతలు ప్రసన్ను లై భోయవారి గా మారి అర్జునుడు యొక్కశక్తి పరీక్షీంచ గా అర్జునుడు చూసే విధంగా లూకాసురు డనే రాక్షసుడి ని పంది రూపమున శివుడు ఆనతిపై రాగా శివుడు అర్జునుల మధ్య యుద్ధం జరుగుతుంది అప్పుడు శివుడు గెలవగా అర్జునుడు ఓడి మండి పడి తన ధనుస్సు తో శివ లింగం పడగొడతాడు. శివునికి తల గాయం అవ్వగా పార్వతి భాధపడగా శివుడు ఆపుతాడు. తరువాత అర్జునుడు మూర్ఛ పోగా శివ, పార్వతులు ప్రత్యక్షంగా అర్జునుడు మూర్ఛ నుండి వచ్చి శివుని తెలియకచేసిన తన తప్పుని కావమని ప్రార్దన చేయ శివుడు ఏమి వరం కావాలో కోరుకొమన అప్పుడు అర్జునుడు సర్వ సంగపరిత్యాగి అయి నిరూపం దర్శించిన నాకు ఏకోరికలు లేవు స్వామి నీలో ఐక్యం చేసుకోమనగా! శివుడు అర్జునా నీవు ఈ జన్మ నందు కారణ జన్ముడవు కావున నీవు కోరిన పాశుపతాశ్రం ఇస్తున్నా,”మరో జన్మలో తిన్నడు వై పుట్టి పరిశుధ్ధాత్తుడవై నను చేరగలవు అని వరం ప్రసాదించి మాయమైపోగా, అర్జునుడు తిరిగి తిన్నడై జన్మించి పార్వతీదేవి వరంము తో భోయవారి దొరుకు తాడు, ఆ భోయవారి లో పెద్ధ అయిన వారికి పిల్లలు లేక పోవడం తో ఆ పిల్లవాడిని అమ్మోరు ప్రసాదం గా బావించి తిన్నడు.అని పేరుతో పెంచసాగాడు. కానీ తిన్నడికి భోయవారు పూజించే అమ్మవారు అయిన ముత్యలమ్మ తల్లి అంటే ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే వాడికి చిన్నప్పటి నుండి దేవుడు కన్న తన శక్తి తే గొప్పది అని నమ్మిన వాడుగా పెరుగుతాడు. ఆ భోయగూడంలో తిన్నడంటే ప్రేమ ఉండటంతో తిన్నడికి మరీ అమ్మోరంటే ఇష్టం ఉండేది కాదు బోయదొరకి అనతి కాలంలోనే ఒక పాప పుడుతుంది లీల అని పేరు పెట్టగా తిన్నడు, లీల చిన్న వయస్సు నుంచి ఒకరి మీద ఒకరికి ఎంతో అనురాగం అభిమానం ప్రేమ చూపుకొంటూ యవ్వనం వచ్చాక వారి కి ఒకరి మీద ఒకరికి అంతులేని ప్రేమ గా ప్రేమించు కొంటారు.
అదే గూడెంలో మరో మల్లు దొర కి ఒక కొడుకు ఉంటాడు. వాడి పేరు మల్లన్న మంచి సాహస బాలుడు బలసాలి దొరబిడ్డ. ఇలా లీల తిన్నడు కలసి ఉండటం మలన్నకు ససేమిరా ఇష్టం లేదు అందుకే వాళ్ళ మీద ఎప్పుడూ కొపంగాపగగా ఉన్నట్లు గా ఉంటాడు. ఒకరోజులీల తిన్నడు తనకు ఒంటరి ఇద్దరూ కలిసి మాట్లాడుతూ ఉండగా మల్లన్న అడ్డుపడి లీల తో నీవు నాకు కాబోయే భార్య వు తిన్నడి తో తిరగవద్దు నేనే ఈ గూడెం దొరని నేను దొరబిడ్డను అని గట్టిగా మందలిస్తాడు. దాంతో తిన్నడికీ మల్లన్న కు చిన్న గొడవ జరుగుతుంది.అది కాస్తా గూడెపు పెద్ధలు విచారణ దాక పోతుంది. అప్పుడు గూడెం దొర అందరిని పిలిచి ఇలా! లీల నా ఒక్కతే బిడ్డ తిన్నడు అమ్మోరు ప్రసాదం మల్లన్న దొర బిడ్డ లీలకీ పెళ్ళి చెయాల లీల తినానడికి మనసు ఇచ్చిందంట దొరబిడ్డ నాదంటాడు లీలను అందుకే మీ రంతా ఏంటి చెప్పతారో అని అందులో ఒక దొర కత్తి కత్తి పట్టి తిన్నడికి మల్లని కి పోటీ ఏర్పాటు చేస్తారు. ఆపోటిలో తిన్నడు గెలవగా లీలను తిన్నడికి ఇచ్చి పెళ్లి చేయాలని గూడెం నాయకునిగా కూడా తిన్నడికికట్టు పెట్టాలని అమ్మోరుకు తిన్నడిని పూజింపమన తిన్నడు నిరాకరించగా అయితే నాబిడ్డ తో నీకు ఇచ్చి పెళ్లి చేయనంటాడు. తిన్నడు అయినసరే నేను గా అమ్మోరికి మొక్కను అని కళాఖండ తేల్చి చెప్పగా దొర తిన్నడికి తన అనుభవాలను తేనిలా చెప్పిన ఫలితంలేకుండా పోతుంది. దొర కూడా లీలను ఇచ్చి పెళ్లి చేయనంటాడు. తిన్నడు గూడెంవదలి వెళ్ళి పోతుండగా లీల తండ్రి దగ్గర సెలవు తీసుకుని నాకు తిన్నాడు లీల తిన్నడిని మామ అని పిలుస్తుంది మామగెలిచిన అప్పుడే మా మనువు అయిపోయింది.అని తిన్నడితో కలసి వెళ్ళి పోతుంది. లీల తిన్నడు ఒక గ్రామమానకీ చేరుకుంటారు. అక్కడ రెడ్డి గార్ల రాజ్యం వారు ఎమి చెపితే అదే ఊరిలో ఆ ఊరిలోనే ఒక పురాతన శివాలయం ఉంటుంది దానికి ధర్మ కర్త గా ఆ ఊరి లో పెద్ధ బ్రాహ్మణ కుటుంబంలో నుండి వంశ్యపారంపర్య గుడి బాగోగులు చూడటం అంతేకాక వైద్య పరంగా శాస్త్రం ప్రకారం గా ఆ గుడి ధర్మకర్త లు చెప్పిందే వేదం ఆ ఊరి రెడ్డి గార్లకు,ప్రస్తుతం ఇప్పటి ధర్మకర్త శ్రీ శ్రీ శ్రీ కైలాసనాధ శాస్త్ర అతని కి ఉన్న తెలివి తేటలతో ఆ ఊరి ప్రజలకు రోజు శివుని తో డైరక్ట్ గా మాట్లాడుతూ నట్టుగా వారిని నమ్మించి వారి దగ్గర నుండి సొమ్ము లు కాజేస్తుంటాడు. ఇంతేకాదు మీ పూర్వీకుల ను స్వర్గానికి పంపె ఏర్పాట్లు చేస్తున్నాను అని కూడా బుస్ మాటతో బోలత్తా కొట్టిస్తుంటాడు. ఈ విషయం ఒక్క కైలాసనాధ శాస్త్రి ,అతని కొడుకు కాశికి తెలిసినా భార్య ఊరకున్న కాశి బయట పెట్టానికీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాని కైలాస శాస్త్రి అడ్డుపడి దూరంగా ఎదో ఒక పని మీద అక్కడ నుంచి పంపెస్తుంటాడు. లీల తిన్నడు ఆ ఊరు చేరుకొని దారి లో జనం అంతా ఉండటం చూసి ఆగి ఏమి జరుగు తుందో ఆగి చూడగా గుడి మెట్లు దగ్గర కైలాసంనాధ శాస్త్రి ప్రజల మధ్య లో ఉపన్యాసం చేస్తూ తను ఇతకు మునుపె కైలాసం పోయివచ్చినట్టు అక్కడ శివుడి తో మీ సమస్య చెప్పి మోక్షం చేకూర్చాఅని మొగవారి ఆడవారి కి మరో అబద్ధాలు చెప్పి వారిని లోబరుచుకుంటూ మరి ఎవర్న తిరగబడితే వారుని దేవుడు పేరు తో అభియోగం మోపి గ్రామాధికారి ని నమ్మించి వారికి శిక్ష పడెలా చేస్తూ వంకర బుద్ధి తో బ్రతుకుతూ ఉంటాడు ఆ ఉపన్యాసం ప్రజల మధ్య లో ఉన్న లీలను చూసి మనసు పడి దగ్గర కు పిలిచి దీవిస్తాడు. తిన్నడు లీల ఆఊరు చివరి యేటుగట్టున ఒక పూరి గుడిసెవేసుకొని కాపురం ఉంటారు. అది తెలుసు కొని ఒంటరిగా ఉన్న సమయంలో లీల పై బలవంతం చేయబోతాడు తిన్నడు తన్ని చంపబొతుండ గా లీల అడ్డు పడుతుంది. ఆప్పటి నుండి కైలాసనాధ శాస్త్రి తిన్నడి పై పగపడతాడు. అవకాశం వచ్చినప్పుడు తెలివిగా దెబ్బ కట్టాలని చూస్తూ ఉంటాడు. ఒక రోజు శివరాత్రి నాడు తిన్నడు వేటకు పోతున్న వేళ లీల మామతో సరదాగా ఈ రోజు శివరాత్రి నీకు వేట ఏమి దొరకదు వేటకు పోక నాతో ఉండు అంటాది. దాంతో కోప పడి తిన్నడు వేట దొరికే దాక ఇంటి కి రానని వేటకు పోయి నిజంగానే రాత్రి పగలు వేట సాగించిన వేట దొరక పోయేసరికి అడవిలో నే తిరుగు తింటాడు. రాత్రి అందులో శివరాత్రి కావడంతో తిన్నడు ఏమి తినడు దానితో శివరాత్రి జాగారంనియమానాలు తెలియ కుండానే పాటించటం వల్ల పుణ్యం కట్టుకుంటాడు. అందుకే శివుడు వచ్చి తన ఈ అడవులో ఒకడిని అని అతని పేరు శివయ్య శివుడిని ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారని పరిచయం చేసుకొని ఎదో భార్య భర్త లు కలిసి చిన్న చిన్న గొడవులు మామూలే ఇంటికి పోనాయన అని భార్య ఎదురు చూస్తూ ఉంటుందని హితవు పలుకుతాడు కానీ తిన్నడు వేట దొరికి తే గాని పోనని శివయ్య మాటలు కొట్టి పడెసి వేట కు పోతాడు పోతు తన తలపాగా పడెస్తాడు. ఆ తలపాగా శివునికి దొరుకుతుంది దానిలో వంటకు కావలసిన పదార్థాలు అన్ని పెట్టకొని మూటకట్టుకొని శివయ్య ఆమూటని లీల కు తీసుకోని పోయి ఇవి తిన్నడి కి బాగా తెలిసివాన్ని అని నామ్మిస్తాడు. లీల ఆతలపాగ మామదే అని నమ్మి ఉండు శివయ్య నీవుకూడ భోంచేసి పోతువు అని అన్నం ఉండి పెడుతుంది మంచి చీరకూడ కడుతుంది.
ఇంతలో తిన్నడు ఇంటికి రాగా అక్కడ ఉన్న సామాన్లు ఎక్కడవి అని అడుగుతాడు దాంతో నీవు పంపావని శివయ్య తెచ్చాడు నేను పంపెనంటే ఎట్లా నమ్మేవు అంటాడు తిన్నాడు లీల తలపాగా చూపిఇందులో మూటకట్టకొని వచ్చాడు అని తలపాగ చూపుతుంది. శివయ్య ఎక్కడ చూపు అనగా బయట ఉన్నాడు అది చేప్పగా ఇద్దరూ వచ్చి చూడగా అక్కడ ఎవరూ ఉండరు అది గమనించిన లీల ఆవచ్చింది సాక్షాత్తు శివుడే అని భక్తి లో మునిగిపోతుంది తిన్నడు పలకరించిన ఉలకదు పలకదు దాంతో ఆగ్రహించి శివయ్య ను కొట్టడానికి పోతాడు శివయ్య కనించకపోవే సరికి వెంటనే గుడిలో లింగాని ప్రకలించగా ఆ మహిమతో తిన్నాడు భక్తుడు గా మారగా శివుడు కనిపించగా పరమభక్తుడు గా మారి పోతాడు. ఇది అంతా కైలాసనాధ శాస్త్రి కొడుకు అయిన కాశిగమనిస్తాడు.
ఆరోజు నుండి తిన్నడు శివుడే సర్వం గా మారి శివుని తో మాట్లాడుతూ నే ఉంటాడు. ఒక రోజు శివుని కొసమని పూలు పండ్లు తో పాటు మాంసం తేనె కూడా తెచ్చి శివయ్య కు పెట్టగా శివుడు ఆశ గా తింటాడు. పక్కరోజు గుడి పూజారి రాగా అక్కడ తిన్నడు అక్కడే ఉన్న బటుల చేత కాలించేస్తాడు అసలు గర్బగుడి లోకి పోవడమే అపశకునం నమ్మిస్తాడు. ఇంకా గుడిలో నగలు కైలాసనాధ శాస్త్ర దొంగలించి తిన్నడు పై మోపి రెడ్డి తో చెప్పి దండిస్తాడు ఎందుకంటే తిన్నడు పై పగ కానీ తిన్నడు నిరపరాదని అతడు నిజమైన భక్తుడు అని కైలాసనాధ శాస్త్రి దొంగని ఆ నగలు ఊరిలో ని బోగమోలకి ఇచ్చారని కైలాసనాధ శాస్త్రి భార్య కొడుకు ఇద్దరు కలసి నిరూపిస్తారు. దాంతో తిన్నడు పరుగు పరుగు న శివాలయం పోగా అక్కడ శివునికి కంట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది దాంతో భయ పడిన తిన్నడు వెంటనే పోయి ఆకు పసురు కంట్లో వేయగా కాని ఆగదు అంతలో తనకి ఒక అలోచన తట్టి తన కన్ను పెడతాడు అప్పుడు రక్తం ఆగిపోతుంది , రెండవ కన్ను లోనుంచి రక్తం కారకుండా.మొదకాగా అప్పుడు రెండవ కన్న పెట్టగా శివుడు ప్రత్యక్షం అయి తిన్నడిని తన భార్య లీలకు మోక్షం ప్రసాదించటంతో కథ ముగుస్తుంది.

“సమీక్ష”
ఇందులో డైరెక్టర్ బాపు గారి ప్రతిభ అంత ఇంతా కాదు పతి పాత్ర ను విలువు గా చూపిస్తాడు. పాటలు ఆరుద్ర నారాయణరెడ్డి వేటూరి వ్రాసిన అవి పాటలు కావు మధుర రాతి మధురంగా ఉంటాయి భక్తి కన్నప్ప గా కృష్ణంరాజు నటన ఆపాత్ర ఇంక ఎవరి తరంకాదు అన్నట్టుగా ఉంటుంది. వాణిశ్రీ అయితే కళాభినేత్రి అన్న తీరులో నటించింది ఇంక రావుగోపాలరావు నటన నవరసాలు కనపడుతాయి అవి మాటలలో కాదు తెరపైనే చూడాలి అమోఘం, ఈ సినిమా గోపికృష్ణ మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు సమర్పించాడు ఆరోజులో సినిమా 100రోజులు లే కాదు అన్ని కేంద్రాలలో నే కాదు ప్రతి సెంటర్ బంపర్ గా ఆడి కృష్ణంరాజు కి అభిమానుల లను రెటింపు చేసింది.ఈ సినిమా ఇప్పటికి శివరాత్రి కార్తీకమాసం ప్రజలు చూసి భక్తి పారవశ్యం అయిపోవాలసిందే ఇంత మంచి భక్తి సినిమా అందించన గోపికృష్ణమూవీస్ వారికి ధన్యవాదాలు మీ ఈ సినిమాతప్పకుండాచూసి తరించ్చండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!