దొందూ దొందే

(అంశం :: “విమర్శించుట తగునా”)

దొందూ దొందే 

రచన::మంగు కృష్ణ కుమారి

అటూ ఇటూ చూసి చెత్త
రోడ్డు మీద కుమ్మరించే
గడసరి ఇల్లాలా, నువ్వా
పూల దొంగలని అందరినీ
ఆడిపోసుకుంటావ్!

ప్లాట్‌ఫారమ్ టిక్కెట్టు కొనవు గానీ రైళ్ళలో
అమ్మేవారినీ, దూకేవారినీ
నానామాటలు అంటావ్?

చెప్పే సెలవు పెడుతున్నావా? ఓ
స్టేనో మాతా! మీ పనమ్మాయి మాత్రం చెప్పకుండా రాకపోతే
‘జీతం కట్’ అంటూ
అరుపులా?

ఆఫీసులో ఫేన్ లూ, లైట్లూ ఆపవు, అక్కరలేక
పోయినా, ఏసి మానవు!
ఓ అప్పారావూ, ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం అంటూ, లెక్చర్ లు ఇస్తావా?

ఆత్మ శుద్ధి చేసుకోండి
మాటా, నడకా, ప్రవర్తనా
త్రికరణ శుద్ధిగా ఒకేలా
ఉండేట్టు ఉండండి!
మీదే జయం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!