ఏది గమ్యం?

(అంశం:”అగమ్యగోచరం”)  

ఏది గమ్యం?

రచన ::గంజి సాంబశివరావు

మానవ జీవన పయనం…సమస్యల వలయం!
మిన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు…
అంటువ్యాధుల ఆలింగనంలో కొట్టుమిట్టాడుతున్న కోట్లాది ప్రజలు!
నిరాశ, నిస్పృహతో ఉన్న నిరుద్యోగ యువత!
ఆశాజనకంగా లేదు వారికి భవిత!
ఉపాధి లేక వలసపోతున్న కూలీలు…
గమ్యం తెలియని బహుదూరపు బాటసారులు!
అన్నదాతల ఆకలి చావులు, అభాగ్యుల ఆర్తనాదాలు!
అతివలపై అత్యాచారాలు, పసికందులపై
అఘాయిత్యాలు…యివే కొందరి కామాంధుల
నిత్య కృత్యాలు!
అధికారుల లంచగొండితనం, అక్రమార్కుల
అవినీతిని అంతమొందించే నాధుడేడీ!?
న్యాయమూర్తులకే రక్షణ లేని ప్రస్తుత వ్యవస్థలో
ఎవరిని అడగాలి న్యాయం? ఎక్కడుంది ధర్మం?
ఏది గమ్యం!
న్యాయ దేవతా… కళ్ళు తెరువు!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!