అంతరించిపోతున్న మానవత్వం

అంతరించిపోతున్న మానవత్వం

రచన: కవిత దాస్యం

మనిషి తనలో తాను బతకడం ఎప్పుడో మరిచి…
కుక్క బుద్ధితో, కోతి చేష్టలతో ఇతరులను ఇబ్బంది పెడుతూ..

దున్నపోతు మీద వర్షం లా మంచి మాటలను
దులిపేసుకొని ఒక మృగంలా…

కాలర్ ఎగరేసుకుని నా అంతవాడు లేడని జీవనం సాగిస్తున్నాడు..
విధి వైపరీత్యం…

ఎన్ని మతాలు ఉన్న అసలైన మతం మానవత్వం..

కులం కూడు పెట్టదు మతం మంచినీళ్లుఇవ్వదు సంస్కారమే సాయం చేస్తుంది…

మమకారమే మంచిని పంచుతుంది
మానవత్వమే చివరికి మిగులుతుంది…

మతం ముసుగులో మారణ హోమం చేసే మారీచులు
ఆ మతవిశ్వాసాలను మంట కలుపుతున్నారు..

మానవత్వం మరిచిననాడు మనిషి మృగం అవుతాడు
ఆ మృగాన్ని మనిషి గా మార్చిన వాడు మహాత్ముడవుతాడు..

కనుమరుగవుతున్న ది జీవ జాతులు మాత్రమే కాదు
కనుచూపు మేరలో కూడా కనిపించని మానవత్వం..

మనిషి మనిషిగా బతకడానికి కూడు గుడ్డ తో పాటు మానవత్వం కావాలి..

మానవత్వం మనిషి యొక్కగుణాల్లో కాకుండా

చేతల్లో కనిపిస్తే కొందరి జీవితాల్లో నైనా చిరునవ్వులు కనిపిస్తాయి..

అన్వేషిస్తే ప్రతి మతంలోనూ దైవత్వం కనిపిస్తుంది
తట్టి లేపితే ప్రతి మతంలోనూ రాక్షసత్వం వికటాట్టహాసం చేస్తోంది..

దైవత్వం ఏదో రాక్షసత్వం
ఏదో తెలిపే మానవతత్వమే మానవత్వం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!