యదలోని భావాలు
రచన: సంజన కృతజ్ఞ
మౌనం ఒక గొప్ప భాష్యం… నా మౌనం నువ్వు…
నా త్యాగం నువ్వు…
నా మదివి నువ్వు…
నా శ్వాస వి నువ్వు…
నాకోసం పలికే ప్రతి పదం మౌనగీతం…
నా కోసం నిరీక్షించే ప్రతి పయనం ఒక మౌన గీతం…
నాకోసం అర్పించే నీ తనువు ఒక మౌనగీతం…
నాకోసం పయనించే నీ పాదం ఒక మౌన గీతం…
నా పయనం నిన్ను చేరి ఆగిపోని మరో మౌన ప్రభాతం కావాలని…
ఆర్తితో ఎదురుచూసే నీ మౌన ప్రేమ కావ్యం…
మౌనంతో సంఘర్షణ… మనసులో ఆవేదన…
శ్వాస తో సంభాషణ… ఆత్మతో నివేదన…
****