కాపాడుకుందాం

కాపాడుకుందాం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మహేష్ వూటుకూరి

మన ప్రతి అవసరం తీర్చే వస్తువుకు
మూలాధారం పుడమి.
మన ఆకలి తీర్చే
ప్రతి ఆహారానికి మూలం చెట్లు.
మన జననం నుండి మరణం వరకు
అన్ని విధాలుగా అన్ని సమయాలలో
అండగా వుండేవి పంచభూతాలు
వీటి కంటే మనకు మేలు చేసేవి
మనతో స్నేహం చేసే వారు
ఇంక ఎవరైనా వుంటారా?
మరెందుకు మనం వాటిని
చిన్న చూపు చూస్తున్నాం?
మరెందుకు మనం వాటిని
కలుషితం చేస్తున్నాం?
ఈ ఉపకారులకు అపకారం చేస్తు
మనకు మనమే అంధకారాన్ని
సృష్టించుకుంటున్నాం..
తిన్నామా పడుకున్నామా తెల్లారిందా
ఇదేనా జీవితం మౌనంగా మనకు
ఎప్పుడు ఏమికావాలో సమకూర్చే
భూమితల్లికి చెట్టు చెల్లికి గాలి నీరు నిప్పు
ఆకాశం లాంటి స్నేహితులకు
మనం మేలు చేద్దాం
ఋణం తీర్చు కుందాం.
పరోపకారం మిదం శరీరం
అనే ఆర్య సూక్తి ని ఆచరిద్దాం
రేపటి తరానికి ఆదర్శంగా ను మార్గదర్శకంగాను
మనల్ని మనం మలుచుకుందాం
మన ప్రగతికి ప్రకృతే తొలకరి
మన చిరునవ్వుల కు
శృతి పుడమి పులకరిపు
మనలో ఎడం కాదు అవి
మనలో భాగం అవి.
అక్కున చేర్చుకుందాం
అమ్మలా ఆప్యాయత గా పలుకరిద్దాం
స్వచ్చంగా వుంచుదాం. ప్రేమిద్దాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!