ప్రకృతి సోయగం

ప్రకృతి సోయగం

రచయిత :: నాగ మయూరి

అదిగదిగో పల్లెటూరు అందాలకు పెట్టింది పేరు

జగతిలోని ప్రకృతి సోయగమంతా మాపల్లెల సొంతం

నీలపురాళ్ళు అంతటా పరుచుకున్నాయ అనిపించే ఆ నీలాకాశం..

నేలపైనున్న కొండలతో పోటీపడుతూఅంబర వీధులలో కనువిందు చేసే వెండికొండల వంటి మబ్బులు ఒక వైపు……

నిఖిల జగతిని మేలుకొలుపుతూ ఆ ఉదయభానుని లేలేత కిరణాలు నేలను తాకగా…..

పచ్చకోక కట్టి ముస్తాబయిన పడుచు పిల్లలా
పచ్చని చేలతో మురిసేటి పుడమి తల్లి ఒక వైపు….

ఆహ! ఎంత చూసినా తనివితీరని ఈ ప్రకృతి సోయగాన్ని వీక్షించినంతనే మదిలో మానసవీణలు మ్రోగకుండునా !….

ఈ ప్రకృతి రమణీయత అంతా పల్లెల సొంతమే…. కాదనగలరా?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!