రైతు పూజ

రైతు పూజ

రచన :: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయం కన్నా ముందే పల్లే మేల్కొన్నది.తోరణాలు పసుపు వాకిళ్ళు ముత్యాల ముగ్గులు శ్రీ మహా లక్ష్మీ లా అలంకరించుకున్న స్త్రీలుపండుగ సంబరాన్ని తెలుపుతూ అంబరం అంటేలా అలంకరించారు. పల్లెలో ప్రతి ఇంట్లో అనందం కనిపిస్తోంది.

పరమాన్నం తప్పని సరిగా వండి పశువులపాకలో కూడా తోరణాలు అలంకారాలు కనిపిస్తున్నాయి

ఏ డ్లకి చక్కగా ముఖానికి పసుపు రాసి కుంకుమ పెట్టీ
కొమ్మలకి రంగులు వేసి కొందరు పువ్వులు కట్టి కొందరు రక రకాల అలంకారాలతో సుందరంగా తీర్చిదిద్దారు. కాళ్ళకి మువ్వలు మెడకి గంట లున్న బెల్ట్ లు పెట్టారు విత్తం కొద్ది వింతలుగా పల్లె అంతా గో శాలల తో సహ అలంకరించు కొన్నారు

ఆఊరి జమీందారు గారు వాళ్ళ ఇంటి దగ్గర రైతు పూజ చేస్తున్నారు ఆ ఊరు ప్రెసిడెంట్ మోతుబరి రైతులు అంతా షామియనా లో కుర్చీలు వేసి అందరూ కూర్చున్నారు.
అందరికీ పేపర్ పల్లాళ్లో చక్కగా పులిహోర పరమాన్నం చిన్న గ్లాసుల్లోకి చక్ర పొంగలి వడలు పెట్టీ తెచ్చి టీ గ్లాసులు ఇచ్చారు మంచి నీళ్ళు చిన్న సీసాలు ఇచ్చారు అందరూ హాయిగా ఆనందంగా తిన్నారు

ఆతరువాత రైతులకి సత్కారం అని వారిని ఓ పది మందిని పెద్ద కుర్చీలో కూర్చో బెట్టి దండ వేసి పంచే టర్కీ తువ్వాలు ఇచ్చారు పళ్ళు కూడా ఇచ్చారు.అగ్రి కల్చరల్ ఆఫీసర్ మండ ల ఆఫీసర్ వీరిని కూడా ఘనంగా శాలువాతో సత్కరించారు ఇంటి దగ్గర పశువులకు తెల్ల వార గట్ల పూజ చేసారు.

అంతా కలసి పొలానికి వెళ్ళారు అప్పటికి పొలం ఎద్దులు కూడా తెల్ల వార గట్ల పూజ చేసి ఉంచారు వాటికి రైతుల చేత పరమాన్నం తినిపించి నాగలి కి కాడి కట్టి
ముందు జమీందారు ఆఫీసర్స్ కూడా చెలో దిగి దున్నారు కూడా రైతులు ఎడ్లు బెదరకుండా పట్టుకున్నారు

ఎవరో ఛానెల్ వారు వచ్చి ఫిలిం కూడా తీశారు చాల బాగా జరిగింది కార్యక్రమం పేపర్స్ అన్నిటి లో ఫొటోస్ తో సహా వచ్చాయి ఆ ఊరు ప్రజలకు ఎంతో ఆనందం వేసింది.
జమీందారు గారు.మేనల్లుడు అల్లుడు కూడా ఒక్ ఛానెల్ లో పెద్ద పొజిషన్ లో ఉన్నారు ట అందుకని ఆయనంటే గౌరవం అందరికీ అతనికి కొన్ని పొలాలు ఉన్నాయి మధ్యలో వస్తూ ఉంటారు ఈ సారి రావడం కుదరలేదు ఎవరెవరి కో చెప్పి పంపారు.ఆవచ్చిన వాళ్ళు ఊరంతా బాగా కవర్ చేశారు .

అసలు పిల్లని ఉన్న ఊళ్ళో ఉండే మేనల్లుడు అని చేశారు
అయితే అతనికి సాహిత్యం సంగీతం ఇష్టం ఒకసారి ఒక్ పత్రిక పోటీకి పల్లె గురించి వ్యాసం రాసి పంపాడు దానికి మొదటి బహుమతి పొందిన ది దాంతో ఆ పేపర్లో సబ్ ఎడిటర్ పోస్ట్ ఉన్నవి చే రమని చెప్పారు సరే అని ముందు తను వెళ్ళాడు. ఆ తరువాత పెళ్ళాన్ని తీసుకెళ్ళాడు. పిల్లలు ఇక్కడ చదువులో ఉన్నారు
అయితే అక్కడకి అవధూతలు స్వామీజీలు సిద్ధంతులు
పండితులు రాజకీయ నాయకులు వస్తె ఇంటర్వ్యు చేసేవాడు వాళ్ళు నాయన తొందరగా ముగించు మాకు మళ్లీ రేడియో ఇంటర్వ్యూ ఉన్నది అని తొందర చేసేవారు
సరే నని పంపేవారు ఆ తరువాత రేడియో వారు క్యాజువల్ ఎంప్లోయస్ కావాలి అన్నపుడు ఇక్కడ మనెయ్య కుండా అక్కడ ఇక్కడ డ్యూటీస్ చేసే వాడు అక్కడ రేడియో ఇంటర్వ్యూ కి వచ్చిన ప్రముఖులు ఇక్కడ పూర్తి చేస్తే మేము టీవీ చానెల్ వారు పిలిచారు అక్కడికి వెళ్ళాలి అనేవారు
అబ్బ ఇదేమిటి ఇలా పరుగు పెడుతున్నారు టీవీ.లో చేరితే మంచిది ప్రముఖులంతా వస్తారు పెద్ద వాళ్ళ పరిచయం అంటే ఎంతో ఇష్టం అందుకని పల్లె నుంచి భార్య బావనను తీసుకు వచ్చావు శ్రీ రామ్ అనే జమీందారు గారి.అల్లుడు

అక్కడనుంచి పెద్ద ఛానెల్ కి హైదరాబాద్ వెళ్లి పోయాడు
ఇప్పుడు తృప్తి గా ఉంది జీవితము కాని పిల్లలు తల్లి కోసం బెంగ పెట్టుకున్నారు.ఇదే మాట అల్లుడితో అంటే తనకు ఖాళీ లేదు మీరు తీసుకు రండి అన్నాడు

మేన మామ అయిన శాస్త్రి గారు అంటే జమిందరుగారు
పిల్ల నిచ్చాను తప్పుతుందా నువ్వు ఊళ్ళో ఉంటవని చేస్తే ఉద్యోగం పేరుతో దూరం వెళ్ళావా అంటూ ఫోన్ లో గట్టిగా అడిగాడు

మామా ప్రపంచం పరుగిడు తోందీ నన్ను పల్లెలో కూర్చో మాంటే ఎలా? ఇక్కడ ఎంతో పెద్ద వ్యక్తులు వస్తారు వారిని ఇంటర్వ్యు చెయ్యాలి అన్నాడు

నీకు సరిపడా సంపాదన మీ నాన్న ఇచ్చాడు పొలం ఉన్నది పెళ్ళాం పిల్లలు పట్టకుండా సంపాదించి ఎవరికి పెడతావు
వాళ్ళని సుఖ పెట్టు ఆతరువాత ఉద్యోగం అని కొంచెం కోపంగా అన్నాడు.
సరే మావయ్య నువు ఎప్పుడు వస్తావవి చెప్పు సెలవు పెట్టు కుంటాను అన్నాడు

పొలం పనులు చూసుకుని పిండి వంటలు చేయించి తెస్తాను అన్నాడు
మనకు వచ్చే ఆహారం అంతా పొలాల నుంచి ఇప్పటి కి పిల్లలకి పిండివంటలు శాస్త్రి గారే వండించి పంపుతారు
ఇంటిల్లి పాదికి బట్టలు కొంటారు సంక్రాంతికి ఎంత చేస్తారో అంతా చేస్తారు
ముఖ్యం ఈ భూమి పూజ
రైతు పూజకి శాస్త్రిగారు ఊరు ప్రక్క ఊరు వాళ్ళు వస్తారు కూడా

అయితే ఈ కాలంలో ఉద్యోగాలు అంటూ సిటీస్ వెళ్ళి పోతున్నారు కూతుళ్లు
కొడుకులు మనుమలు పెద్ద వాళ్ళు మాత్రం పల్లెలో ఉంటున్నారు

కొందరు పిల్లాలో చదువు తక్కువ ఉద్యోగం లేని కొడుకుల్ని వారి దగ్గర పెట్టుకుని పొలమప్పా చెప్పి కౌలికి కొన్ని ఇప్పించి పూర్తి గా వదల కుండా చూసుకుంటున్నారు
రైతు బాగుంటేనే ఆరోగ్యాలు బాగుంటాయి
శాస్త్రి గారి పిల్లలు మాత్రం నాన్న గారు మీకు ఓపిక ఎప్పుడు లేక పోతే అప్పుడు మేము వచ్చి వ్యవసాయం అందుకుంటాము ప్రస్తుతం మీరు ఊరికి పెద్ద గా అన్ని చూసుకుంటున్నారు అప్పటికి మా పిల్లల చదువులు ఉద్యోగాలు వచ్చేస్తాయి అంటూ ఉంటారు

నేల వదిలి సాము ఎందుకు చేస్తాము నాన్న గారు అంటారు
నిజమే రైతు బాగుంటేనే మనకు తిండి బాగుంటుంది
అందులో ఇప్పుడు సేంద్రియ ఎరువులు పంటలు మొదలయ్యాక ఆహారం బాగుండటం గాక ఆరోగ్యం బాగుంటుంది ఇప్పటికీ శాస్త్రి గారి ఇంట్లో దంపుడు బియ్యం వాడుతారు పిల్లలు తినలేము అంటే మాత్రం వలుపుడు బియ్యం తెప్పించి వండుతారు రెండు రకాలు మంచివే.
కూరలు పళ్ళు అన్ని కూడా పెరటి తోటలో పండిస్తారు ఇంటి రుచి వేరు అయిన మనుమలంత పల్లె వచ్చినప్పుడు తాత గారి పద్ద తులు వింటారు ఆచరిస్తారు
పట్టు పంచే కట్టి భోజనం.చేస్తారు ప్రస్తుతానికి ఆయన ఇంట్లో ఇంకా పాఠ పద్దతి ఉన్నది
అందుకే ఈ తరానికి కూడా ఊరంతా అయందే పెత్తనం ఏరువాక పూర్ణిమ అంటే మహ పెద్దఎత్తున కాలువకు భూమికి ఎద్దులకు రైతులకి ఘనంగా పూజచేసి ప్రసాదం పంచి పెడతారు సంప్రదాయాలు వదలకుండా ప్రకృతి రక్షణ చేసిన నాడు ఎప్పుడైనా సరే భగ వంతుడు రక్షిస్తాడు
భావము లోన భాగ్యము నందును గోవిందా గోవింద అని కొలువ వో మనసా అని శోభా రాజ్ గళం నుంచి శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన వినిపిస్తోంది

ప్రకృతి దైవం గా పూజిస్తే సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం కూడా పా టలో దైవత్వాన్ని తెల్పు తొంధీ
ఇంటికి రాగానే ఇంట్లో కూడా భార్యా పూర్ణ కూడా చక్కగా శ్రీ లక్ష్మి దేవ లా పట్టు చీరతో నగలతో జమీందారు లక్షణాలతో ఉంటుంది శాస్త్రి గారు రాగానే రండి ఆలస్యం అయింది పట్టు పంచే కుట్టుకు రండీ భోజనం వడ్డిస్తా ను అన్నది అందరికీ పులిహార పెట్టీ నప్పుడు ఏదో కొంచెం.తిన్నారు అంటూ మంచి నీళ్ల గ్లాసు అందించిది
పర్వెలేదు అందరూ తృప్తి పడ్డారు నాకు చాలా ఆనందంగా ఉంది ఉంటూ నవ్వారు
సరే మీకు ఊరు సేవ ముఖ్యము అని ఆమె నవ్వింది
వెండి కంచంలో అన్నం వడ్డిస్తూ రండీ అంటూ తొందర చేసింది.
హాయిగా.ఇద్దరు నవ్వుకున్నారు.
అలా.శాస్త్రి గారి అల్లుడు పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు
రెండో అల్లుడు విజయవాడ రేడియో స్టేషన్ లో పని ఇంక అయానకి లోటు ఏమిటి?

రైతు పూజకి అంతా వస్తారు కానీ ఇప్పటి పరిస్తితుల్లో ఎవరు రాలేదు కొడుకులు ఇద్దరు మద్రాసులో ఇంజనీర్స్ .ఇంక పొలం పనుల న్ని ఆయన
మనుష్యుల్ని పెట్టీ చూసుకుంటారు.

అంతా పొలం పనులు ఉన్నప్పుడు కొన్నాళ్ళు వచ్చి ఉంటారు కూడా భూమి పూజ అంటే ఎంతో ఇష్టం ఎంత ఎదిగినా ఆహారం మనకు పల్లెనుంచి కదా వచ్చేది
పల్లె బాగుంటేనే మనం బాగుంటాము
మీరు తింటే గానీ పనివాళ్ళు తినరు నేను తినను అంటూ మళ్ళీ పిలిచి దొడ్లో ఆకులు వేసుకోండి నేను మీకు వడ్డి స్తాను ఆయన నిముషం లో తింటారు మీకు వడ్డన చేసి నేను పెట్టు కుంటాను అని అందర్నీ తొందర చేసింది
తృప్తి గా అందరూ తింటేనే
మాకు అనందం. అన్నది ఈ లోగా ఉల్లో ఉన్న అడ పడుచు వియ్యపురాలు వచ్చింది ఇంకే భోజనాలు అవలేదు నడు పూర్ణ నువ్వు కూర్చో నేను వడ్డుస్తా అంటూ చనువుగా గరిటె అందుకున్నది .ఒకసారి అందరి భోజనాలు అయ్యాయి అక్క భోజనానికి నువ్వు రాలేదు కానీ వడ్డన చేస్తున్నాను అన్నాడు శాస్త్రి గారు దాని దేముంది మీ బావగారు ఇంత సేపు ఉండలేరు కదా అందుకని ఆయనకోసం రాలేదు ఇప్పుడు వచ్చాను నీకు మరదలికి బట్టలు తెచ్చాను భోజనం అయ్యాక కూర్చో బెట్టి ఇస్తాను అన్నది ఎందుకే అక్కా. అన్నాడు అబ్బే పద్దతి పడ్డతీ నువ్వు ఈ కొడుకువి రైతుల్ని నువ్వు సత్కరిస్తే నిన్ను నేను సత్కా రిస్తాను ఈ లోగా మీ
బావ గారు వస్తారు అని నవ్వింది

అనందం గా అందరూ నవ్వుకున్నారు నేను నీకు బావగారికి బట్టలు పెడతాను అన్నిరెడి గానే ఉన్నాయి అంటూ హాయిగా నవ్వు కొన్నారు

శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!