ఆకలి అవసరం

ఆకలి అవసరం

రచన :: బండి చందు

అది వర్షాకాలం. అప్పుడప్పుడే అడవి అందంగా పురుడు పోసుకుంటుంది. తన ఒడిలో ఎన్నో జీవరాశులకు ప్రాణంపోసి అల్లారుముద్దుగా సాకుతుంది. అదే అడవిలో నింగి నేల కలిసినట్లుండే చోట ఒక గూటిలో రెండు కుందేళ్ళు చాలా కాలంగా కాపురముంటున్నాయి. ఆ కుందేళ్ళు ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్ళేవి. వాటి జంటను చూసి మిగితా జంతువులన్ని వాటిని ఎంతగానో మెచ్చుకునేవి. వాటిలా బ్రతకాలని ఆశపడేవి. కానీ ఆ కుందేళ్ళను తినాలని ఎప్పటినుండో ఒక నక్క ప్రయత్నిస్తుంది. ఎన్ని సార్లు తినాలని చూసినా అవి ఏదో ఒక విధంగా తప్పించుకునేవి.

కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. కాల చక్రంలో ఋతువులు మారి ఎండను దాటుకొని వానాకాలం ప్రవేశించింది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వానలు త్వరగా వచ్చాయి. పైపెచ్చు ఆ వానలు ఎడతెరిపి లేక రేయింబవళ్లు అనే తేడాను చూపక అడవి అంతటిని హస్తగతం చేసుకొని మరి ఏక చక్రాదిపత్యంతో కురవసాగాయి.

గత రెండు నెలలుగా ఆ అడవిలో కురుస్తున్న వానలకు ఏ జంతువు బయటకి వచ్చి ఆహారం వెతుక్కునే పరిస్థితి లేదు. వానలు పడుతున్నాయని సంతోషించాలో లేక కడుపు నిండే పరిస్థితి కూడా లేదని భాదపడలో తెలియని స్థితిలో పడ్డాయి ఆ రెండు కుందేళ్ళు. అవి దాచుకున్న ఆహారం కాస్త అయిపోయి రానురాను బక్కచిక్కిపోయాయి.

ఎప్పటినుండో అదునుకోసం ఎదురుచూస్తున్న నక్క వాటి దుస్థితిని గమనించింది. మెల్లగా వాటి దగ్గరికి చేరి లేని పోనీ ప్రేమను చూపిస్తూ జాలితో అల్లుడు ఈ వాన వల్ల మనకు ఎంత కష్టం వచ్చిపడింది. అడవిలో ఉన్న జంతువులకు ఎక్కడా ఆహారం దొరకడం లేదు. కానీ నేను పొద్దునే ఇక్కడికి కొంత దూరంలో ఒక గ్రామం చూసాను. ఆ గ్రామంలో చాలా పొలాలు ఉన్నాయి. అక్కడికి వెళ్తే మనకి కచ్చితంగా ఏదో ఒకటి తినడానికి దొరుకుతుంది అని నమ్మబలికించింది. ఆ నక్క మంచిది కాదని తెలిసినా దానితో వెళ్ళడం ఇష్టం లేకపోయినా ఆకలికి తట్టుకోలేక అవి నక్కతో కలిసి అది చెప్పిన దారి గుండా వెళ్ళాయి. చాలాసేపు వాటిని నడిపించి ఆ కుందేళ్ళు తప్పించుకోలేని స్థితిలో నక్క వాటి మీద దాడి చేసింది. ఆకలి ఎంత విచిత్రమైనది ఎంతటి వారినైనా అది బలి తీసుకుంటుందని తెలియక కుందేళ్ళు నక్క చేతిలో తమ ప్రాణాలను వదిలేసాయి. నక్క ఆ రెండు కుందేళ్ళను ఎంతో ఇష్టంగా భుజించి దాని ఆకలి తీర్చుకొని అక్కడినుండి మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయింది.

***

You May Also Like

One thought on “ఆకలి అవసరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!