ఆత్మ విమర్శ

(అంశం :: “విమర్శించుట తగునా”)

ఆత్మ విమర్శ

రచన::డి.స్రవంతి

ఓ మనిషి విమర్శ తగునా?
ఆత్మ విమర్శ చేసుకో !
పైస తత్వమునకు లొంగిన మనుషులు
కుల,మత ప్రలోబాలకు బందీలు
నీవు మారి నీ సమాజ గతిని మార్చారా!

పగ ప్రతికారాలే ద్యేయం
ప్రజల ప్రగతి శూన్యం
ఒకరినొకరు విమర్శించుకోవడం లక్ష్యం
చేసిన వాగ్దానాలను మరచి
చేసే విమర్శలు తగునా
నిన్ను నీవు విమర్శించుకో !
అలనాటి మహనీయుల జాడ నడిచి
రాజకీయ రణరంగపు రాత మార్చారా..
ఓ .. మనిషి మేలుకో!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!