(అంశం :: “విమర్శించుట తగునా”)
సద్విమర్శే సాహిత్యానికి ప్రాణం
రచన::పిల్లి.హజరత్తయ్య
మనిషి చేసే తప్పు ఒప్పులను
సరిదిద్దువాడు బ్రహ్మదేవుడు
కవిత్వంలోని లోటుపాట్లను
సర్దిచెప్పేవాడు విమర్శకుడు
విమర్శకునిలో విషయం ఉన్న యెడల
కవిత్వం పదికాలాలు మెఱియును
సద్విమర్శకుడు కావ్యమునకు
తుది మెరుగులు దిద్దును
కావ్యంలోని లోపములను సరిదిద్దిన
చిరస్థాయిగా నిలుచు కడవరకు
కాకి పిల్ల కాకికి ముద్దు అన్నట్లు
కవి రాసిన కవిత్వము తనకు ముద్దు
తన తప్పులను తెలుసుకుని
కావ్యమును ఆధునీకరించిన
కవి కవిత్వము వర్ధిల్లు.!
సద్విమర్శే కవిత్వమునకు ప్రాణం
మార్పును ఆహ్వానించే లేని కవిత్వం
మనజాలదు చరిత్రపుటల్లోన
మంచి అన్నది మార్పు అయిన
మహిలో నిలుచు కవియును
మన్ననలు పొందు కవిత్వమును
మహర్ధశ పొందు సాహిత్యమును