ఏకాంతం

ఏకాంతం

రచన:ఐశ్వర్య రెడ్డి

మనసు స్వేచ్ఛ కొరకు
నీతో మధురమైన ఏకాంతం
వయసు స్వేచ్ఛ కొరకు
నీతో వరసైన స్త్రీ కాంతం

నాలోని కోరికలకు శ్రీకారం
మనదైన కలలకు ప్రాకారం
నాతో నీవు నీతో నేను
మనమే జగమైన ప్రేమ బంధం

సుమధుర సుస్వరాల సంగీతం
అంబరాన్నంటిన ఆనందం
ఇరు హృదయాలను తడిమిన
మన చెలిమి పరిపూర్ణం

మనకై  మనమై  మురిసిన
సాటిలేని సయ్యాటల సంబరం
పరవశించి పెనవేసుకున్న
వలపు వరదల వసంతం

కోట్ల హృదయాలలో
కోరి దాచిన కోరికలజగడం
ఏరికోరి ఎన్నిన మదితో
కూడి సౌందర్య నిరాజనం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!