నిరీక్షణ

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

నిరీక్షణ

రచయిత :: పి. వి. యన్. కృష్ణవేణి

అబ్బా, చాలా అలసట ఉంది ఈ రోజు అనుకుంటూ, ఏసీ ఆన్ చేసుకుని బెడ్ పైన వాలిపోయాను. కాసేపు ఆగి ఫ్రెష్ అవ్వచ్చులే అని కళ్లు మూసుకుని పడుకున్నాను. బాగా అలసి పోయి ఉన్నందున మగతగా నిద్ర కూడ పట్టేసింది.

నేను ఒక కంపెనీలో కన్స్ట్రక్షన్ మేనేజర్ గా పని చేస్తున్నాను. ఇవాళ సైట్ వర్క్ ఉండటం వల్ల, చాలా టైరెడ్గా అనిపిస్తోంది. మామూలుగా సైట్ కి వెళ్లాల్సిన అవసరం రాదు. కానీ ఈ రోజు కంప్యూటర్లు సరిగ్గా పనిచేయక పోవటం వల్ల సైట్ కి వెళ్లి వర్క్ చెయ్యాల్సి వచ్చింది . అది కూడా ఊరు చివర అవటంచేత, ప్రయాణం కూడా బాగా చికాకు అనిపించింది.

అందానికి అందం, తెలివికి తెలివి ఉన్న మేము,  ప్రేమించి పెళ్ళి చేసుకున్నాము. అతనే, హరీష్. అతను కూడా వేరే కంపెనీలో  ఇలాంటి మంచి పొజిషన్లోనే ఉన్నాడు. మా జంటను చూసిన అందరూ మేడ్ ఫర్ ఈచ్ ఆదర్ అంటూ ఉంటారు.

నేను నెమ్మదిగా కళ్లు విప్పటానిక ప్రయత్నం చేసాను. కళ్లు విప్పుడు పడటం లేదు. ఒళ్లు అంతా ఒకటే బరువు. నిజంగా చెప్పాలి అంటే, ఇంకో మనిషి బరువు కూడా మోస్తున్న ఫీలింగ్. కొన్ని అవయవాలు అయితే ఎవరో పిండినట్టు నొప్పులు. భారంగా కళ్లు విప్పి చూసాను.

చుట్టూ చిమ్మ చీకటి. నేను రూమ్ లోకి  వచ్చి, లైట్స్ ఆన్ చేశాను. కరెంటు పొయిందా అనుకుంటూ లేచాను. నా బాడీ నా స్వాధీనంలో లేదు. సెల్ లో టైం చూస్తే, రాత్రి 9 గంటలు. అంటే, నేను 2 గంటలు నిద్రపోయానా, అని ఆశ్చర్యంగా చూస్తు మంచం పైనుంచీ లెవబోయాను.

నా బాడీ అసలు సహకరించడం లేదు. ఒక ఇంచ్ కూడా, కాదు, కాదు ఒక కాలు కూడా కదల లేని పరిస్తితి. అంత ఏసీ లో కూడా, నా ముచ్చెమటలు నాకు తెలుస్తున్నాయి. ఇంతలో నా సెల్, జై జనార్ధనా, కృష్ణ ..రాధిక పతే అంటూ రింగ్ అయ్యింది. వెను వెంటనే. నా శరీరం నా ఆధీనంలో కి రావడం, వెంటనే  కరెంట్ రావడం ఒకేసారి జరిగాయి.

ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, అన్నాను.

హరీష్ : హలో, హారిక నేను రావటానికి ఇంకో గంట పడుతుంది. నువ్వు డిన్నర్ చేసి పడుకో… నేను ఇక్కడే డిన్నర్ చేస్తున్నాను. అని ఫోన్ పెట్టేశాడు.

ఒక్క సారిగా, ఒళ్లంతా నిస్సత్తువ ఆవహించినట్లుగా, నీరసం వచ్చేసింది. కిచెన్లోకి వెళ్ళి, టీ పెట్టుకుని తాగుతూ టీ.వీ చూస్తున్నాను. కొంచెం రిలాక్స్డ్ గా అనిపించింది.

ఏమైంది నాకు, రోజూ అలవాటు అయిన వర్క్ కి కూడా ఈ రోజు ఇంత అలసిపొయాను అనుకున్నాను. కానీ, ఒకటి మాత్రం నాకు గుర్తు ఉంది. ఎప్పుడూ లేనిది, ఈరోజు సైట్ దగ్గరకు వెళ్ళగానే, ఒక లాంటి ఉలికిపాటు, ఆదుర్దా, ఆందోళన అక్కడే మొదలు అయ్యాయి.

ఇలా ఆలోచిస్తూ ఉంటే అంతే కానీ, ఫ్రెష్ అయ్యి వద్దామని, నైట్ డ్రెస్ తీసుకుని వాష్ రూం లోకి వెళ్లాను. శారీ తీసి పక్కన పెట్టానో, లేదో మళ్ళీ ఒళ్లు అంతా ఎదో ఆవహించినట్లుగా బరువు. నా ఒళ్లంతా ఎవరో.   తడుముతున్నట్టు నాకు స్పృస్టంగా తెలుస్తోంది.

మళ్లీ నా ఫోన్ రింగు అయ్యింది. రింగ్ టోన్ అదే పాట. ఇందాకటి లాగానే, నా ఒళ్లు మొత్తం మాములు అయిపోయింది. టవల్ చుట్టుకుని, గబగబా బయటకి వచ్చి,

హలో అన్నాను. నా ఫ్రెండు విరూప ఫోన్లో. ఫోన్ పెట్టెయటం ఇష్టం లేక, ఎదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాను. హరీష్ వచ్చేంత వరకూ గడుపుదాము అనే ఆలోచనతో.  కానీ, విరూప మాత్రం, వాళ్ళ 3 నెలల బుజ్జి పాపాయి నిద్రలేచింది అని ఫోన్ పెట్టేసింది.

మళ్లీ నాకు టెంక్షన్ మొదలు అయ్యింది. హరీష్ కనీసం ఒక మెసేజ్ అయినా చేస్తే బాగుండు అని సెల్ తీసి చూస్తు ఉన్నాను. ఒంటరిగా ఉంటే అదే ఆలోచనలు.

హాల్లో టీ. వీ ఆన్ చేసి, బెడ్రూంలోకి వెళ్లాను. డ్రెస్ అప్ అవ్వడానికి. నా బాడీలో మార్పులు మళ్ళీ మొదలు అయ్యాయి. ఈసారి మాత్రం అంత తేలిక కాదు, ఆ చేతుల నుండీ విడిపించుకోవటము, నాకు తెలుస్తోంది ఆ చేతులు ఒక మగ మనిషివి. కనిపించని మనిషివి.

నేను నిద్రపొయే వరకూ ఎదురు చూస్తూనే ఉన్నాను. హరీష్  నుంచీ లేదా ఎవరినుంచీ అయినా సరే,  ఒక ఫోన్, ఒక  మెసేజ్ కోసం. ఎందుకంటే, ఆ దేవుడి పాట వల్లనే, నా బాడీ నా స్వాధీనంలో ఉంటోంది అని నా నమ్మకం.

కళ్లు తెరిచి, నెమ్మదిగా కాదు భయంగా చుట్టూ చూసాను. తెల్లవారింది. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను.

హరీష్ మాత్రం నేను నిద్ర లేవగానే, టీ తెచ్చి ఇచ్చాడు.
తాగి, కొంచం రిలాక్స్ అయ్యాను. ఏమైంది రాత్రి అంతా నీకు? అని అడిగాడు.

నిన్న పొద్దున నుంచీ జరిగింది అంతా చెప్పాను. అంతా విని, నన్ను రెడీ అవ్వ మని, దగ్గర లోని గుడికి తీసుకువెళ్ళాడు.

అక్కడ మాత్రం నాకు  కాస్త  మనసు ప్రశాంతంగా అనిపించింది. చాలా సేపు కూర్చున్న తరవాత, హరీష్ చెప్పటం మొదలు పెట్టాడు.

ఆ ఏరియా గురించి నేను నిన్ననే విన్నాను. నువ్వు వెళ్ళిన ప్రదేశం దగ్గరలోనే, రిసెంట్ గా చాలా ఇళ్లు ఫైర్ ఆక్సిడెంట్లో కాలి పోయాయి. చాలా మంది ఆడమగ ప్రాణాలు గాలి లో కలసిపోయాయి.

ఆ నెగటివ్ వైబ్రెషన్ వల్లనే, నీకు అక్కడకి వెళ్ల గానే, అలా అనిపించి ఉండొచ్చు. మూడ నమ్మకం అనుకోకపొతే, ఏదైనా ఆత్మ వల్ల అయ్యి ఉండవచ్చు.

ఏది ఎమైనా, మనసుకు ఒక ప్రశాంతత చేకూరుతుంది అని ఇలా గుడికి తీసుకువచ్చాను అన్నాడు.

తన వివరణ విని, నాకు చాలా ముచ్చటగా అనిపించింది. తన అభిప్రాయం నా మీద రుద్ద లేదు. అలాగని నన్ను అలాగే వదిలేయ లేదు. నాకు ఏది మంచిదో, అదే చేశాడు.

ఆ రోజు మొత్తం ఇద్దరం ఆఫీస్ కు సెలవు పెట్టి, గుడిలోనే ఎక్కువ సమయం గడిపాము. తరవాత హోటల్లో భోజనం చేసి, కాసేపు మా ఇంటికి దగ్గరలోనే ఉన్న పార్క్ కు వెళ్లాము.

ఆ రోజు రాత్రి, తన పక్కనే ప్రశాంతంగా, నిశ్చింతగా నిద్రపోయాను అన్నీ మర్చిపోయి హాయిగా. ఒక వారం మాత్రం, హరీష్ నన్ను అసలు వదలి వెళ్ల లేదు.

ఏ రోజులు అయినా, మనం ఎంత ముందంజలో ఉన్నా, ఇలాంటి చిన్న చిన్న నమ్మకాలు అందరిలో ఉంటాయి. అలాంటప్పుడు మాత్రమే, ఎదుటి వారి మనసులో మనకున్న  విలువ ఎలాంటిదో తెలుస్తుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!