ఓ కాలమా

ఓ కాలమా!

అంశం: నిన్ను దాటి పోగలనా

పుట్టుకతోనే అమ్మ ప్రేమని రుచి చూపిస్తావు
నాన్న త్యాగాన్ని మనసుని తెలియచేస్తావు
ఎదిగే కొద్దీ ఎన్నో అనుభూతులు అందిస్తావు
ఎన్నెన్నో బంధాల్ని ముడివేస్తావు
మరెన్నో బంధనాలను కల్పిస్తావు
సంతోషాల సంద్రంలో ముంచి తేలుస్తావు
వెంటే కష్టాలు ఉన్నాయని గుర్తు చేస్తావు
ఆనందాల హేలలో ఓలలాడిస్తావు
దుఃఖాల సాగరంలో ఈదు లాడిస్తావు
ప్రేమనీ ఇస్తావు… ద్వేషాన్ని ఇస్తావు…
సమయమా నిన్ను గెలవటం సాధ్యమా!
ఓ కాలమా! నిన్ను దాటి పోగలనా!!

రచయిత ::  పరిమళ కళ్యాణ్

You May Also Like

2 thoughts on “ఓ కాలమా

  1. నిజమే కాలాన్ని దాటడం ఎవరి తరం👏👏👏👏😊

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!