మదిని  దాటి పోగలనా

మదిని  దాటి పోగలనా

అంశం : నిన్ను దాటి పోగలనా

మరుపురాని జ్ఞాపకాల మజిలీలో
గడిచే కాలపు గాయలను
మరువను అంటున్న నా మదిని
దాటి పోగలనా ప్రియా నేస్తమా.
కవ్వించే కళ్ళతో  చురుకైన బాణాలు వేసి
మురిపించే తియ్యని మాటలతో ప్రేమ మంత్రమేసి
మెరిసే  తెల్లని ముత్యపు వాన జల్లులా నవ్వును విసిరేసి
నీ అందం అనే లోకంలో ప్రేమ అనే
తలపులతో  బంధీని చేసినా
నీ ప్రేమ అనే వలను దాటి పోగలనా ప్రియా నేస్తమా.
అనురాగపు ప్రేమ వానలో తడిసిన
మన తనువులు కలిసి వేసిన అడుగుల సాక్షిగా
నువ్వు నేను అనే పిలుపు మనం అనే బంధంగా
మారి ఒకరికి ఒకరై ముడిపడిన ఈ క్షణం లో నిన్ను దాటి పోగలనా ఓ ప్రియతమా.

రచయిత :: చలిమేడ ప్రశాంతి

You May Also Like

One thought on “మదిని  దాటి పోగలనా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!