నీ కోసం నా ప్రేమ
నీ ప్రేమ నాకు ఒక వరము నీ స్నేహం నాకు
చెరుగని ఒక జ్ఞాపకము.
నీతో ఉన్న ప్రతి క్షణం ప్రకృతిలో కురిసిన
తొలకరి ప్రేమ జల్లులే
నీ అందంతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తు ఎదో తెలియని జ్వాల.రేకెత్తిస్తుంది.
నీ యవ్వనం నాలో చిగురించిన పారిజాతాలే
నీ నవ్వులు నాలో పన్నీటి జల్లులే
కొత్తగా తొడిగిన లేలేత మొగ్గలా తొడిగిన పరువాల అందం నా కోసమే
నీ ప్రేమకు నను దూరం కానీయకు
కౌగిలిలో ఉండి పోవాలని ఉంది.
నీ ప్రేమ మల్లెతీగలా పాకుతుంటే నీ ప్రేమకు
నే పందిరినై అల్లుకు పొవాలని ఉంది
నీపై పెంచుకున్న ప్రేమ గౌరవం నాలో
ఉప్పెనలా పొంగింది.
నీ కష్టాలలో నీ నీడలా నీ వెన్నంటే ఉంటాను
నా ఊహల్లో నా మనసులో నీవే
నా జీవితం నా సర్వం నీతోనే నా జీవితం
అడవి గాచిన వెన్నెల కానీయకు.
రచయిత :: సుజాత