రైతు ప్రయాణం

రైతు ప్రయాణం

భూమిని చూస్తూ  తన ఆనందాన్ని పెంచుకుంటు …
తన చెమటను చిందిస్తూ ….
తన కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటూ ,
నారు  నాటి ,నీరు పోసి …

మొలకలు కోసం ఎదురుచూస్తూ
మొలకలు వచ్చినప్పటి నుంచి
పొలాన్ని కంటిరెప్పలాగా చేసుకుంటూ …
పొలాన్ని పాడుచేసే క్రిమికీటకాల నుంచి కాపాడుకుంటూ

రేయి అనక పగలు అనక !!!
ఎండ అనక వాన  అనక  !!!
ధాన్యాన్ని చేతికి అందే వరకు తనని తాను మర్చిపోయి శ్రమించే శ్రామికుడు …

తన పడ్డ కష్టానికి  తగినంత ప్రతిఫలం దక్కకపోయినా ..
దొరికిన దాంట్లో తృప్తి చెందే  అల్ఫ సంతోషి….

పంట కోసం అప్పు చేసి ఆది తీర్చలేక
తనవులు  చాలించినవారులెందరో
అందరికి అన్నం పెట్టె అన్నదాత .

తన నమ్ముకున్న వారికి గుప్పుడు మెతుకులు

పెట్టలేక  విషాన్ని తాగి అశువులు బారుతున్నవారెందరో!

ఎన్ని చూస్తున్న ,ఎన్ని జరిగిన
తన  పొలాన్ని వదలలేక…
భూమితో తన  ప్రయాణాన్ని వదలలేక సతమతవుతు నిత్యం పోరాటం చేసే సైనికుడు !!!

  పోరాటం ఆపని ఓ పోరాట సైనిక
అన్నదాత వేయివందనాలు నీకు
జై జవాన్ !!! జై  కిషన్
అన్నదాత సుఖీభవ !!!

రచయిత :: ధనలక్ష్మి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!