అనుబంధాల పొదరిల్లు

అనుబంధాల పొదరిల్లు

కష్టంలో సుఖంలో ఒకరికొకరు
తోడై నిలుస్తూ…
మమతలు పెనవేసుకున్న
అనుబంధాలతో అల్లుకొన్న పొదరిల్లు…!

మనసులోని మాటలను
నిస్సందేహంగా పంచుకొనే
నివాసం…
ప్రపంచంలో శాంతిసౌఖ్యాలను
అందించే ప్రశాంత ధామం…!

పడిన శ్రమను కబుర్లతో,అల్లర్లతో మరపింపజేస్తూ…
ఆత్మీయత మేళవించిన భోజనంతో కడుపునింపే సదనం…!

హాయితో శాంతితో ఇలలో స్వర్గాన్ని తలపింపజేస్తూ…
ప్రేమను పంచుకొని పెంచుకొనే
అనురాగ నిలయం…!

బోసినవ్వుల బుజ్జాయిలతో పసికూనల ముద్దుమురిపాలతో రంజింపజేస్తూ…
నానమ్మ తాతయ్యల
కథలతో,గారాబపు
బుజ్జగింపులతో…
అలరారే ఉమ్మడికుటుంబాల
ఉనికి క్రమంగా
కనుమరుగౌతూ…!

ఎవరి గదుల్లో వారుగా విడిపోతూ,విచ్ఛిన్నమౌతూ..
స్వార్థమనే పీఠమెక్కి అందుకోవాలని ఆశపడుతోంది ప్రేమతాయిలం…!

ఒకరి అవసరాలకు ఒకరు
అందుబాటులో లేక…
కుటుంబమన్న పదానికి
అర్థాన్ని వెతికేలా చేస్తూ…!

చరవాణి వీక్షణాలతో తృప్తిపడుతూ…
మిథ్యానుభూతిని ఆస్వాదిస్తూ…
సమ్మేళనాలతో సరిపెట్టుకుంటోంది…!!!

రచయిత :: చంద్రకళ. దీకొండ 

 

You May Also Like

One thought on “అనుబంధాల పొదరిల్లు

  1. మీ పొదరిల్లు రచన సూపర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!