ఋతువుల రాణి

ఋతువుల రాణి

రచయిత::వాడపర్తి వెంకటరమణ

కొన్నిసార్లు మండుటెండలో ‘గ్రీష్మ’ తాపంలా/
కొన్ని వెచ్చని అలక కిరణాలు ప్రోదిచేసి/
నాపై విసురుగా విసిరి వెళ్ళిపోతుంది!/

అలక కరిగిన అరక్షణంలోనే/
‘వసంత’ బాలలా రివ్వున ఎగిరొచ్చి/
గుండె గూటిలో గువ్వపిట్టై ఒదిగిపోతుంది!/

కరిమబ్బులు ‘వర్షా’న్ని మోసుకొచ్చినప్పుడు/
చినుకుల ముత్యాలను దోసిళ్ళలో ఏరుకొచ్చి/
అవధులులేని అల్లరి పిడుగైపోతుంది!/

చీకటి ‘శిశిరం’ నా కళ్ళలో కదలాడినప్పుడు/
గుండె గదినిండా ధైర్యమనే పసరుపోసి/
గీతాసారాన్ని చెప్పి కొత్త వెలుగు చూపిస్తుంది!/

చికాకుల దుర్గంధం ముసురుకున్నప్పుడు/
‘హేమంత’ సమీరమై సాంత్వన పరచి/
పరిమళాలు వెదజల్లే పొదరిల్లై అల్లుకుపోతుంది!/

శోభాయమానమైన ‘శరత్కా’లంలో/
వెన్నెల సొనలు భువికి చేరుతున్నప్పుడు/
సృష్టి కార్యానికే ప్రణయ పాఠాలు నేర్పుతుంది!/

ఆరుకాలాల సారాన్ని ఆకళింపు చేసుకున్న/
ఋతువుల రాణి…నా విరిబోణి!!

You May Also Like

One thought on “ఋతువుల రాణి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!