నాలోనేను

నాలోనేను

వెలి వేయబడిన కన్నీటి బిందువు నేను
ఎడారి ఓయాసిసై ఏ ఒక్కరి దప్పిక తీర్చలేను
నిషేదించబడిన కలము నేను
నిషిద్ధ అక్షరాలతో సంతకంగా మారలేను
ఏ కదలిక లేని రాయిని నేను
ఏ శిల్పి భావాలను నాపై పలికించలేను
చలనం లేని అలను నేను
కడలి లోని ముత్యాలను ఒడ్డున చేర్చలేను
రూపం లేని ప్రతిబింబం నేను
ఏ ముఖ చిత్రాన్ని నాలో ఇముడ్చుకోలేను
కలము లిఖించలేని కాగితం నేను
ఏ జ్ఞాపకాల గురుతులను నిలుపుకోలేను
మనిషి మనిషి మధ్య మౌన గీతిక నేను
మరణం అంచున సైతం దాన్ని చేరపలేను.

రచయిత :: బండి చందు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!