ఎవరికి సాధ్యం

 ఎవరికి సాధ్యం?

స్వార్థం కట్టలు తెంచుకున్న
కఠిన మానవ హృదయాల
నిస్వార్థపు కవాటాలు
బిగించడం ధన్వంతరికైనా సాధ్యమా?

అన్యాయం అలవాటుగ మార్చిన
కీచకుల కీచు గొంతులకు
సమన్యాయమను గంటను
కట్టడం న్యాయదేవతకైనా సాధ్యమా?

అక్రమాలను వృత్తిగ జేసి
కుర్ర గిత్తలా ఎగిరే దౌర్జన్యాన్ని
పరాక్రమంగా సక్రమరీతిగ
క్రమీకరించడం కలిపురుషునికైనా సాధ్యమా?

అధర్మాలనే ఆస్తులు జేసి
అపవిత్రపు క్రియాశీల పాపాత్ముల
పాశముతో పవిత్రుల్ని జేసి
భువికి పంపుట యమధర్మ రాజుకైనా సాధ్యమా?

రచయిత:చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!