ప్రకృతి శోభ

ప్రకృతి శోభ

రచయిత :: వి. కృష్ణవేణి

పచ్చనిచెట్లు
ప్రకృతికి  సోపానమై
ప్రాణావాయువును శుద్ధిచేసే
ఆయుధ ధారినిగా
ప్రకృతికి శోభనిస్తూ
ఆరోగ్యాకరమైన వాతావరణాన్ని సృష్టిస్తూ
జీవమనుగడకు ఎంతగానో దోహదం చేస్తూ
వాతావరణాన్ని శుద్ధి చేసి
ప్రకృతి వైపరీత్యాలనుండి
విపత్కర పరిస్థితుల నుండి
రక్షణగా
వాయుకాలుష్య నివారిణిగా,
జీవనదారిగా ఉంటూ భూతాపాన్ని
తగ్గిస్తూ
ఎన్నోజీవరాసులకు జీవనాధారాన్ని కల్పిస్తూ
ఆయువును పెంచే
ఔషదదారిని,
వనమూలికలనంధించే కల్పవల్లిగా
సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమై పూజలందుకున్న నిత్యవల్లిగా
కలుషితరహిత ధరణినిచ్చే
నితంతర వాహనదారినిగా
ఎగిరే పక్షులకు ఆశ్రమమై
మూగ జీవాలకు ఆహారంమై
కడవరకు, చితి మంటై తోడుండే
వాహన దారివై
అడుగడుగునా జీవనదారిగా
ప్రకృతికై శోభనిస్తూ
.జీవులకు ప్రాణాదారిని అయిన చెట్లను
రక్షించుకుంటూ పరిసరాలను పరిశుభ్రంగా  ఉంచుకుంటూ పర్యావరణ పరిరక్షణను చాటిచూపద్దాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!