మృత్యుభయం మా చెడ్డది..!

మృత్యుభయం మా చెడ్డది..!

రచయిత: చైత్రశ్రీ(యర్రాబత్తిన మునీంద్ర)

దిగులు నిండి
ఆవేదన చెంది
చింతతో చెలిమి జేసి
ఆందోళనలో ఆవిరవుతున్నది
గుప్పెడంత గుండె…..

వేగం ఎలా పెరుగుతుందో
నొప్పి ఎలా కలుగుతుందో
ఎప్పుడు ఆగిపోతుందో తెలియని స్థితిలో
ఆ హృదయ విదారక స్థితి
మరో యదకి రాకూడదని తనలో తానే
కుమిలిపోతూ ఉంది…

ధైర్యాన్ని వీడి
భీతితోనే బతికే ఆ శరీర తత్వం
గుండెకెలా మారుతుంది…
మృత్యుభయం మా చెడ్డది….కదా…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!