సింధూరం

సింధూరం

నామని సుజనాదేవి

‘హలో….నీ పేరు శశిధర్ కదూ…’ అన్న అతన్ని ఎక్కడో చూసినట్లనిపించడం తో మౌనం గా తలూపుతూ ప్రశ్నార్ధకంగా చూసాను.
‘మీ అమ్మ పేరు శిరీష కదూ…!’ నా ప్రశ్నార్ధకం పట్టించుకోకుండా మరో ప్రశ్న .
అవునన్నట్లు తలూపుతూ అతనెవరో గుర్తు రావటం తో ‘మీరు…మీరు ..శశిధర్ అంకుల్ …యామై రైట్….’ అన్నాను ఆనందంగా చిరునవ్వుతో.
‘యా….యూ ఆర్ రైట్ … భలే గుర్తు పట్టావే…ఎంత చిన్నగా ఉండేవాడివి…. పది సంవత్సరాలు అవుతుందనుకుంటాను కదూ! అమ్మ బావుందా!’’ ఆ గొంతులో ఏంతొ ఆత్మీయత, ఆనందం… ఎవరో తెలిసిపోవడంతో ఏకవచనం లోకి దిగిపోతూ అడిగాడు.
‘ఆ…’ అంటూ ఎలా గుర్తు పట్టారని అడిగాను. రెండు సంవత్సరాల ముందు మా బంధువుల ఇంటికి వైజాగ్ వెళితే ప్రక్కనే మీ ఇల్లు ఉంది. అమ్మ కనబడి రమ్మంటే వెళ్లాను. నువ్వపుడు స్కూల్ కేల్లావనీ, నీ ఫోటోలన్నీ చూపించింది. ఆ తర్వాత అమ్మకి ట్రాన్స్ ఫర్ అయి మీరేల్లిపోయారని తెలిసింది. ఇదిగో ఆ తర్వాతిదే చూడటం…’
‘మా ఆల్బం లో మీ ఫోటో ఎప్పటికీ చూస్తుంటాను…కాబట్టి నేనలాగే గుర్తుపట్టాను’ అంటూ కిటికీ నుండి వీడ్కోలు చెబుతూ వెనక్కేలుతున్నట్లున్న చెట్లను చూస్తూ గతం లోకి జారిపోయాను.
తను అమ్మ కడుపులో ఉన్నపుడే నాన్న పోయారట. రోజు రాత్రి ఆరుబయట అమ్మమ్మ దగ్గర పడుకునేవాడు తను. అపుడు అమ్మమ్మ ఎప్పటికీ అమ్మ గురించి చెబుతుండేది. ‘ఏడేడు జన్మల బంధం కోసం, ఏడడుగులు నడిచి వస్తే ఏడు నెలల స్మ్రుతులైనా మిగల్చలేదు మీ నాన్న….ఈ పిచ్చిదానికి చిన్నప్పటి నుండే సింధూరం అంటే బాగా ఇష్టం. పెద్దదాన్నైనా నేనే బొట్టు బిళ్ళలు పెట్టుకుంటుంటే, అదేమో ఆరిందాలా, ‘అమ్మా…. నుదురు బ్రహ్మస్థానం … అది ఎప్పుడు తెజోమయంగా వెలుగుతూ ఉండాలి. సింధూరం ఉష్ణాన్ని చల్లార్చి చల్లదనాన్ని కలిగిస్తుందని మా మాస్టారు చెప్పారు. సిందూరం లోని అందం ఆ బొట్టు బిల్లల్లో ఉందా! కుంకుమ పెట్టుకోమ్మా!’ అనేది, తను కుంకుమ పెట్టుకుంటూ, పసు పు, కుంకుమ, పూలు అంటే పడి చచ్చేది. ఎ పేరంటానికి పిల్చినా తనే ముందుండేది. ఊరంతా తిరిగి తెచ్చి, గుళ్ళోకి , తనకి విడివిడిగా మాలలు కట్టేది. అన్ని పూలదండలు సమర్పించిన దాని బ్రతుకును, రెండు పదుల వయస్సు వరకైనా పూలకు నోచుకోకుండా చేసాడా భగవంతుడు. దానికెంతో ఇష్టమైన పేరంటాలకు, శుభకార్యాలకు దేనికి ముందు నడవనీయకుండా చేసాడా దేవుడు’ అనేది అమ్మమ్మ.
‘అసలు నువ్వు భూమి పైకి వచ్చే వాడివే కాదురా! …ఏమిటో అదే చాదస్తంతో ఇలా చేసుకుంది గాని!’ అన్న మాటలు చిన్నగా ఉన్న తనకి అప్పుడర్ధం అయ్యేవి కావు. అమ్మను అబార్షన్ చేసుకుని మరో పెళ్లి చేసుకోమని ఎంత బలవంతం చేసినా వినకుండా తనకు జన్మ నిచ్చిందని తర్వాత తెలిసింది.
అసలే అందంగా ఉండే అమ్మను వెకిలిగా చూసే మగవాళ్ళ చూపులు అప్పుడు అర్ధమయ్యేవి కావు. అమ్మకేంతో ఇష్టమైన పేరంటాలకు ఎందుకు వెళ్ళ దో , చీకట్లోనే వాకిట్లో పని పూర్తీ చేసి తెల్లవారితే బయటకు ఎందుకు రాక పోయేదో తెలియక తను వేసే ప్రశ్నలకు మౌనమే సమాధాన మయ్యేది చాలాసార్లు. ఒక్కోరోజు రాత్రేప్పుడైనా తను నిద్రమత్తు నుండి లేస్తే ఏడుస్తూ కూర్చునే అమ్మ కనపడేది.
ఏమీ తెలియని అమ్మకు నాన్న ఉద్యోగం వచ్చెలా చేయడానికి, నాన్న చనిపోయినందుకు అతనికి రావాల్సిన డబ్బులు వచ్చేలా చేయడానికి చాలా శ్రమపడ్డాడు నాన్న ఫ్రెండ్ శశిధర్. అలా పరిచయమైనా ఆయన, నాన్న పోవడంతో దాదాపు అందరు దూరమైనా తమను ఎలాంటి కష్టంలోనైనా ఆదుకునేవాడు. రోజూ కనీసం ఒక్కసారైనా ఇంటి కొచ్చి నాతొ ఆదుకుని, కబుర్లు చెప్పి వెళ్ళేవాడు.
కొంతకాలం తర్వాత స్కూల్ నుండి వచ్చిన తనకు, ‘ఆలోచించండి పది మంది పది రకాలను కుంటున్నారని చేయని తప్పు కోసం మనమెందుకు బాధపడాలి. నాకింకా పెళ్లి కాలేదు. వేరే వారిని చేసుకునే ఉద్దేశమే లేదు. మీకు చాలా చిన్న వయస్సు, మీరు ఇష్టపడితే పాని గ్రహనికి నేను సిద్ధమే. బాబు విషయంలో మీరేం బాధ పడవద్దు . ఇప్పటికీ వాడిని ఒక్కరోజైనా చూడకుండా ఉండలేక పోతున్నాను. ఆలోచించుకునే మీ నిర్ణయం చెప్పండి’ అన్న అంకుల్ మాటలు వినిపించాయి గాని ఆ వయసులో తనకేం అర్ధం కాలేదు.
ఆ తర్వాత తనతో అమ్మ ‘మరేమో కన్నా…మనింటి కొచ్చే అంకుల్ ని ‘నాన్న’ అని పిలవడం నీ కిష్టమేనా’ అని అడిగినపుడు ‘చ! అంకుల్ నాన్నేలా అవుతారు? ..అంకులే నేనస్సలు పిలవనలా’ అన్నాడు తను. తెలిసీ తెలియని వయసులో ఉన్న తనకు తెలియదు, తన నిర్ణయమే చిగురించాలనుకున్న మోడును మోడులాగానే ఉండడానికి కారణమవుతుందని.

మరో పక్షం రోజులకు అంకుల్ వచ్చి తనను దగ్గరకు తీసుకుని ఆయనకు ట్రాన్స్ ఫర్ అయిందని కొత్త డ్రెస్, చాక్లెట్స్ ఇచ్చి కన్నీళ్ళతో టాటా చెప్పి వెళితే, మంకెన పువ్వుల్లా ఉన్న అమ్మా కళ్ళు చూస్తూ, ‘అంకుల్ ఇంక మనింటికి రారా మ్మా!’ అన్న తనను దగ్గరకు తీసుకుంటూ తల అడ్డంగా తిప్పింది అమ్మ. అలా వెళ్ళిన అంకుల్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడిలా. ఆ వైపే చూస్తున్న నాకు, ఆయన కళ్ళలోని ఆర్ద్రత కి కళ్ళు చెమర్చాయి. ఇప్పుడు నలభై, నలబై అయిదు మధ్యలో ఉంటుందేమో వయస్సు ఆయనకు. ఇదివరకటి కన్నా హుందాగా కనబడుతున్నాడు. మాటల మధ్య ఇటీవలే అక్కడకు ట్రాన్స్ ఫర్ అయినట్లు చెప్పారు. ఇంటికే రమ్మన్న నా ఆహ్వానాన్ని మృదువుగా తిరస్కరిస్తూ ఇంటి అడ్రస్ తీసుకుని మళ్ళీ వస్తానన్నారు. నేనూ ఆయన అడ్రస్ తీసుకున్నాను. అప్పటి కన్నా మరింత గంభీరత సంతరించుకున్న మోము తప్ప పెద్దగా ఏమీ మారలేదాయన. నన్ను చూడగానే ఆ కళ్ళల్లో మెరిసిన మెరుపు నా దృష్టిని దాటిపోలేదు. బస్ దిగినా అమ్మ కష్టాలు, కన్నీరు…అవే ఆలోచనలు వెంటాడాయి ఇల్లు చేరేవరకు. నిజంగా అమ్మ జీవితంలో సుఖం లేదు. మేజర్ కాగానే పెళ్ళయ్యింది. పెళ్ళయిన సంవత్సరంలో నాన్న పోవటం తో ఏంతొ చలాకీగా చైతన్యానికి ప్రతీక లా ఉండే అమ్మ గంభీరతకు విషాదానికి మారు పేరులా మారి పోయింది. ‘దాని కన్నా పెద్దదాన్ని నేను అన్ని పేరంటాలకు వెళుతుంటే , గుడ్ల నీరు కుక్కుకుని ఒంటరిగా ఉండే దాన్ని చూస్తె నా కడుపు తరుక్కుపోతుంది’ అంటుండేది అమ్మమ్మా.
‘’ కాని ఎం చేయను…రమ్మని బలవంతంగా దాన్ని తీస్కేలితే అక్కడ అందరి ముందు మేము పసుపు కుంకుమ లను అందించుకుంటుంటే , దాన్ని వేలేసినట్లు బాధను ఎక్కవ చేసేలా చేయలేకపోతున్నాను. అన్ని పూజలు చేసిన దానికి ఇలాంటి ….ఆ భగవంతునికి దయలేదు. ‘ అనెది అమ్మమ్మ .
వేరే పెళ్లి ఎందుకు వద్దందో ఇప్పుడు నాకు కొంచెం అర్ధమవుతుంది. వేరే పెళ్లి చేసుకుంటే నన్ను బాగా చూసుకుంటారో లేదోనని, నాకేమైనా అన్యాయం జరుగుతుందేమోనని….. అసలు జీవితంలో అమ్మ ఎం సుఖపడింది. ఎందుకు విధి అమ్మ జీవితంతో ఎలా ఆదుకుంది? ఇప్పుడు తను అమ్మ సంతోషం కోసం ఏమీ చేయలేదా ? ఆలోచనల్లోనే ఇల్లోచ్చింది. ఎదురొచ్చిన చేతిలోని బాగ్ తీసుకుంటున్న అమ్మతో,’అమ్మా! శశిధరంకుల్ కలిసారమ్మా ’’ అన్నాను.
‘అవునా..గుర్తుపట్టావా? ఎక్కడ..ఎలా ఉన్నారు?’ ఆతంగా ప్రశ్నల వర్షం.
‘ఇక్కడకు ట్రాన్స్ ఫర్ అయిందట. ఇప్పుడు ఇదే ఊళ్ళో ఉంటున్నారు. ఇంటికి రమ్మన్నాను. ..మరోసారి వస్తానన్నారు’ అన్నాను.
నాన్న పోవటంతో నాన్న ఉద్యొగం అమ్మకు వచ్చేలా చేసి మేము ఆర్ధిక ఇబ్బందులు లేకుండా బ్రతికేలా చేసింది శశిధరంకులే అని నాకు తర్వాత తెలిసింది. అందుకే నాకు ఆయనంటే అదో రకమైన అభిమానం, గౌరవం.
కార్తిక పౌర్ణమి కావడంతో ఎప్పటిలా ఆ రోజు సాయంత్రం గుళ్ళో దీపాలు పెట్టడానికి సరంజామా అంతా తీసుకుని నేను, అమ్మ వెళ్ళాము. నేను దర్శనం చేసుకుని కొన్ని దీపాలు వెలిగించి అలా కూర్చున్నాను. అమ్మేమో భక్తీ గీతాలు పాడుతూ వత్తులు, నూనె వేసి దీఎపాలు వెలిగిస్తోంది. గుడి అంతా దీపాల వెలుగులో దేదీప్యమానంగా వెలుగుతూ వింత అందాన్ని సంతరించుకుంది. మనస్సు నిండాఆనందాన్ని నింపుతుంది. దీపాల వెలుగులు శివలింగం పై పదీ సంతసిస్తున్న శివుని మోముని అందులో ప్రతి ఫలిస్తున్నట్లున్నది. జ్వాల వెలుగు శివలింగం లోపల మండుతున్నట్లు శివుని మూడో నేత్రంలా భాసిల్లినట్లుతుంది. దీపాలన్నీ త్రిశూలాకారంగా, లింగాకారంగా ఆదిమూలమైన ‘ఓం’ ఆకారంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణం లో కూర్చుని చూస్తున్న నాకు అంతా కనబడ్తుతోంది. ధ్వజ స్తంభం దగ్గరకు అమ్మ దీపం వెలిగించుకుని చేతిలో పట్టుకుని వస్తున్నది. ఎదురుగుండా వచ్చినాయన ‘బావున్నారా!’ అన్నమాటకు చటుక్కున తలెత్తింది. ఆ కళ్ళల్లో ఒక్కసారిగా మెరుపులు. బహుశా ఈ దీపం వెలుగు కళ్ళల్లో ప్రతిఫలించిందేమో ఆ వచ్చినాయన శశిధర్ అంకుల్. ఇద్దరి మధ్య నున్న దీపం వెలుగులో ఇద్దరి మొహాల్లోని ఆనందం ప్రస్పుటంగా కనబడుతుంది. ధ్వజ స్తంభం దగ్గరే కూర్చున్న నాకు వారు, వారి మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి. కాని నేను అక్కడే ఉన్న సంగతి ఇద్దరూ గమనించినట్లు లేదు.
‘ఆ..మీరెలా ఉన్నారు…ఇక్కదికెప్పుదికేప్పుదోచ్చారు’ అంది అమ్మ సంభ్రమంగా.
‘ఈ మధ్యనే…విజయ్ నన్ను చూసి గుర్తు పట్టాడు. ఏంతొ పెద్దగా అయిపోయాడు. చాలా సంతోశం అన్పించింది. కార్తీక మాసం దీపారాధన చూడగానే మీరే గుర్తొచ్చారు. వెన్వెంటనే ప్రత్యక్షం కూడా అయ్యారు’ అంటున్నారాయన.
‘కార్తీక మాసం కదూ…మీ వాల్లెరి…’అంటున్న అమ్మతో
‘ఎదురుగుండానే ఉన్నా రు. వెనకేవరూ ఉండరు..’ అన్న ఆయన మాటలకు
‘ఏమిటీ..మీ భార్యా, పిల్లలు….మీరింకా పెళ్లి చేసుకోలేదా…’ అనడిగింది విభ్రాంతి గా.
‘ఈ జన్మకా యోగం లేదు లెండి..’ అని ‘ఆఫీసేలా ఉంది’ అంటూ మాట మార్చారాయన.
నాకెందుకో వారిద్దరూ అల్లా మాట్లాడుకునున్న దృశ్యం చాలా ముచ్చటగా అందంగా కన్పించింది. ఎ ఆభరణాలు లేకుండా కనీసం నుదుట సింధూరం లేని అమ్మ ముఖం, ఆనందంలో మిళితమై, నుదిటి మధ్యలో ఎర్రగా ప్రతిఫలిస్తున్న జ్వాల సింధూరంగా కనబడి ఏంతొ అందంగా అన్పించింది.; కుంకుమతో ఉన్న అమ్మ ముఖం నాకు పరిచయం లేదు.
వీడ్కోలు తీసుకుంటు న్నప్పుడు ‘ఇంటికి రండి అంకుల్’ అన్న నా ఆహ్వానానికి ‘అమ్మా నువ్వు కూడా చెప్పమ్మా’ అన్న నా మాటలకు ఇరువైపులా మౌనమె సమాధానమయ్యింది. దారి పొడుగునా ఎవరి ఆలొచనల్లొ వారున్నాం. చిన్న వయస్సులొనె వైధవ్యం వల్ల ఎమాత్రం సుఖం లెకుందా పొద్దటి నుండి అర్ధరాత్రి వరకు ఒక యంత్రమ్లా పని చెసింది. నెనెప్పుడూ అనుకునెవాన్ని. ఈ తల్లి రునమెట్లా తీర్చుకొగలను అని . అందరి తల్లుల కన్నా నాకు ఇంకా ఎక్కువ శ్ర ధ్ధ చూపించి తన ఆశలజ్యొతె నెనుగా, కెవలం తన ధ్యెయమె నన్ను తీర్చిదిద్దడ మన్నట్లుగా నా ప్రతీ పరీక్శ తనకె పరీక్శలా నాతొ ఉండి చదివించి, ప్రోత్సహించి నా తొటి పిల్ల ల మాట లకు నె బాధ పడి తె, నాన్న లెరని నెను ఫీల్ కాకుండా అన్ని రకాలుగా నెను సంతోష పడేట్లు సర్కస్ లకి, జూలకి, పార్కులకి తీస్కెలుతూ కష్టమే కలగకుందా తన కలల ప్రతి రూపం నెనైనట్లు పెంచింది. ఒక్కొసారి తొటి స్నెహితుల అలవాట్లు అవీ చూస్తుంటే నాన్న లెకున్నా వాళ్ళ కన్నా నెనె అన్ని రకాలుగా ఎ లొటూ లెకుండా పెరిగానా అనిపిస్తుంది. ఒక్కొక్క సారి నెను చెప్పె విష యాలకు ఫ్రెండ్స్ కూడా ‘నిజంగా నువ్వు అదృష్ట వంతుడి విరా ‘ అనెవారు. తనకీ ఎప్పటి కీ అనిపించెది ఎమైనా చెసి అమ్మ ముఖములో జీవితాంతం నవ్వును చూసెలా చెయాలని. కాని ఇప్పుటి వరకు అలాంటి అవకాశం రాలెదు. కాబట్టి ఇపుడై నా ఎలాగైనా చెసి వారిద్దరికీ పెల్లి చెస్తె…తనకెమీ తెలియని వయస్సులొ తన కోసం అమ్మ పెల్లి చెసుకొలెదు. ఇప్పటి కీ ఇంకా చిన్న వయస్సె అమ్మది. తను మళ్ళీ చదువు కొసం దూరం వెల్లిపొతున్నాడు . కనీసం మూడు ఏళ్ళు అడ పా దడ పా వచ్చినా, కొన్ని రొజులుంటా డే మొ…. ఆ తర్వాత కూడా ఉధ్యొగం ఎక్కడ వస్తె అక్కడ లెదా పై చదువుల కొసం ఎక్కడి కైతె అక్కడి కి వెల్లాల్సిందె. అప్పటి వరకు తన రాక కొసం క్షణాలు లెక్కిస్తూ ఒంట రిగా జీవచ్చవమ్లా అమ్మ…అమ్మమ్మ నుండి ఉద్యొగం కొసం దూరం వఛ్కాక అమ్మ మరీ ఒంట రిదయిపొయింది. అమ్మకు అంకుల్ తొ పెళ్లి చెస్తె…………. ఎంత బావుందీ బావన. ఆ అంకుల్ ఇంత వరకు చెసుకొనిది కూడా ఇందుకెనెమొ? అందుకె రేపు తన పుట్టిన రొజు న అంకుల్ ని ఇంటి కి పిలిస్తె సరి పొతుంది . ఆ రొజు తానెం అడి గినా కాదనదు…అనుకుంటూ ఆలొచనల్లొ ఎప్పుడో నిద్రపొయాడు .

తెల్లవారి తలంటు తున్న అమ్మతొ, ‘ఆమ్మా నెనొకటి కోరుతాను. తీరుస్తావు కదూ’ అన్నాను.’అదేంట్రా ..నీ కొరిక దెన్నైనా ఎప్పుడైనా కాదన్నానా’ అంది.’అమ్మా శశిధరంకుల్ పెళ్లి చేసుకోకుండా ఉన్నది ఎందుకొసమొ తెలుసా…నీ కొసం ఈ రొజు భొజనానికి పిలిచి అడిగేస్తాను’ సూటి గా అన్నాను.
వెంటనే చెంపపై కొట్టింది అమ్మ.
‘ నీకెమైనా పిచ్చి పట్టిందా…నాకేంటి ? పెళ్ళేంటి? …ఎవరైనా ఎమనుకుంటారు … అసలు నీకు ఇలాంటి పిచ్చి ఆలొచనలెలా వస్తాయి…ఊర్కొ నొరెత్తక ..’ కసురుకుంది గాబరాగా.
‘ఎవరొ ఎమో అనుకుంటారని బంగారం లాంటి జీవితాన్ని ఎందుకు పాడు చెసుకుంటా వమ్మా..అయినా నీకెమంత వయసయి పొయిందని..ఇప్పుడు నెను ఎలాగూ పై చదువుల కు దూరమవుతున్నాను. ఒక్కదానివె ఎలా ఉంటా వు ఒంట రిగా…అమ్మమ్మ ఈ విష యం వింటే ఎంత సంతొషి స్తుందొ..అందుకె రమ్మన్నాను …’ అంటుండగానే అమ్మమ్మ వచ్చింది.’ఎమిటే అర్జంట్ గా రమ్మన్నావు , ఫొన్ చెస్తె హడ లిపొయాను..అంతా కులాసెనా’ అంటూ అమ్మమ్మ రాగానే అమ్మమ్మాతొ నెమ్మదిగా విష యం చెప్పా ను. ఎంతొ సంతోష పడింది .
సాయంత్రం శశిధరంకుల్ రాగానె అమ్మమ్మ విషయం అడి గింది. ఆయన ‘తనకి ఇష్టమే ’ అన్నారు. సిగ్గుతొ కుంచించుకు పొతూ లొపల గదిలొ ఉన్న అమ్మను ఇద్దరం రెండు వైపులా భుజాలు పట్టు కుని తీసుకొచ్చాము. చంద్రుడు లెని ఆకాశములా బొసిగా ఉన్న అమ్మ నుదుటి ని చూడ లెక నెను దెవుడి దగ్గరి కుంకుమను అమ్మమ్మ కిస్తె, అమ్మమ్మ అంకుల్ కిచ్చింది. ఇద్దరు ఒకెసారి తడబడ్డారు . అంకుల్ అమ్మను దెవుడి దగ్గరకు , నాన్న ఫొటో దగ్గరకు తీసుకెల్లి మొక్కి అమ్మ నుదుట సింధూరం పెట్టా క, అమ్మ ముఖం ఎంతొ నిండు గా, పరిపూర్నంగా, అందంగా, కాంతి వంతంగా కనిపించింది. నా మనస్సంతా హాయిగా అనిపించింది. కలకాలం అలాగె ఉండాలని అమ్మమ్మ కాళ్ళకి మొక్కుతున్న వాల్లిద్దరినీ ఆశీర్వదిస్తె, ముగ్గురి చేతుల్లొ అక్షింతలు పెట్టి కాళ్ళు మొక్కాను నేను . నా అభీష్టాన్ని పై నుండి ముక్కోటి దెవతలు కూడా ఆశీర్వదిస్తున్నట్లు గుడి లొని జే గంటలు మోగుతుండగా అక్షింతలు పూల జల్లులా , వెన్నెల వర్షంలా నా తలపై పడ్డాయి .

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!