కనువిప్పు

కనువిప్పు

రచన:: చెరుకు శైలజ

శ్రీజ లేచవా! చూడు చంటి ఎలా ఏడుస్తున్నడో తల్లి సరళ అంది. అబ్బా మమ్మి నీవు చూసుకో నన్ను పడుకోని శ్రీజ పక్కకి తిరిగి పడుకుంది. ఇదే కూతురు వైఖరి రోజు లేవదు. కొడుకును చూసుకోదు. వాడేమో మునిగిపోయినట్టు మాతోనే లేస్తాడు .అలా లేవడం వలన ఏ పని కాదు సరళకి, ఏదో ఒకటి కావాలని పేచీ పెట్టడం, ఏడవడం ,భర్త ఆఫీసుకి వెళ్ళాలి. ఒక ప్రైవేట్ ఆఫీసులో పని చేస్తున్నాడు గోపాలరావు వీళ్ల కి ఒకతే కూతురు శ్రీజ .లేక లేక ఎన్నో పూజలు చేయగా పుట్టిన కూతురు అందుకే అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఏనాడు ఒక మాట అని ఎరుగరు.ఆ గారాబం తోనే శ్రీజ ఇలా తయారైంది. డిగ్రీ పూర్తీ కాగానే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. అబ్బాయి కళ్యాణ్ సాప్ట్ వేర్ ఇంజినీర్ .ఉన్న దాంట్లో పెళ్లి బాగా చేశారు. వారి కుటుంబం మధ్య తరగతి కుటుంబం.
ఆ వచ్చిన జీతం పైన ఇంటి ఖర్చు గడవాలి.పైగా బిడ్డ పెళ్లికి కొన్ని అప్పులు చేశారు. నెల నెలా జీతం రాగానే అవి సర్దుబాటు చేసుకుంటు సంసారాన్ని నెట్టుకు రావడం. ఈలోపు అల్లుడు రెండు సంవత్సరాలు ఇక్కడ జాబ్ చేసి కొడుకు పుట్టాగానే యుస్ వెళ్లడానికి రెడీ అయ్యాడు. ఎందుకు అల్లుడుగారు ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకోక అని గోపాలరావు ఎంత చెప్పిన వినకుండా, వెళ్దాం అని నిశ్చయించుకున్నాడు. మరీ బాబు శ్రీజ అని అత్త గారు అడిగింది .
ఒక రెండు సంవత్సరాలలో వచ్చి తీసుకు వెళ్ళుతాను అని చెప్పి ,శ్రీజకు నచ్చచెప్పి కొడుకు విమల్ మిస్ అవుతున్నందుకు బాధ పడుతు వెళ్లి పోయాడు.
భర్త వెళ్లి ఆరు నెలలు అయింది. అప్పటి నుండి కూతురు శ్రీజ బద్ధకంగా మారిపోయింది. తొందరగా లేవదు. ఏ పనిలో తల్లికి సహాయపడదు. కొడుకును ఆసలు పట్టించుకోదు. సరళ గోపాలరావు ఏమి అనలేక భర్త మీద బెంగతో అలా ఉందని ఊరుకుంటున్నారు.
మనవడి పనులు ఇద్దరు కలిసి చేయడం వారి గారాబం వలన మరి తిక్కగా తయారైనాడు. వాడిని పట్టడం వారికి చేతి కాక పక్కనే బేబి కేర్కి పంపిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల బాబుని. గోపాలరావు డ్యూటీ మనవడిని దింపుకుంటు ఆఫీస్కి వెళ్లి పోతాడు. మరల మధ్యాహ్నం వంట చేసి సరళ తీసుకు వస్తుంది.
కనీసం కొడుకు నైన తీసుకోని రాదు కూతురు. సరళ, గోపాల్ రావు పనితో అలసిపోతున్నారు.ఏమి అనలేక చూస్తూ ఉండలేక మనసులోనే టెన్షన్ పడుతున్నారు. కూతురు పెళ్లి చేసుకొని అత్త వారి ఇంట్లోనో, లేక భర్త దగ్గర ఉంటేనో, ఆ విషయం సంతోషంగా ఉండేది. భర్త అమెరిలో, అత్తవారు ఊరీలో ఉన్న ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూసి వస్తుంది. కాని ఉండదు. ఒక వారం రోజులు ఉండొచ్చు కదా! అని తల్లి అంటే అబ్బా మమ్మీ నేను ఉండను. పొద్దునే లేవాలి పని చేయాలి.అందుకే నేను ఉండను. కూతురు అలా అనేసరికి ఏం మాట్లాడలేక ఊరుకుంటుంది సరళ.
అలా రోజులు గడిచిపోతున్నాయి.ఒకరోజు సరళకి అసలే ఓపిక లేదు. మనవడు లేచీ ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుని ఆపి వాడిని సముదహించి పాలు తగించి ,స్నానం పోసి ఫే స్కూల్ కి పంపాలంటే, ఆ దేవుళ్ళు దిగి వస్తారు. గోపాలరావు సరళకి పనిలో ఆసరా అవుతున్న, సరళకి ఆపనులు చేయడం కష్టంగా ఉంది. ఆ ఏడుపును ఆపడం తన తరం కాక, బిడ్డను పిలిస్తే నీవే చూసుకో,నిరాలక్ష్య జవాబు. కోపం ఆపుకోలేక గదిలోకి వెళ్లింది. శ్రీజ ఫోన్లో భర్తతో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇక్కడ కొడుకు అంతా ఏడుస్తున్న, తను పిలుస్తున్న లెక్క చేయకుండా, ఆ కోపంలో ఏమిటే? నీవు ఆ ఫోన్ పెట్టేయ్? ముందు వాడిని సముదాయించి, తరువాత మాట్లాడు, అన్న వినిపించుకోలేదు. లాభం లేదు. అనుకోని శ్రీజ చేతిలో ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించింది. ఆ ఫోన్ ఇవ్వకుండ మాట్లాడుతునే వుంది. చేయి పట్టి లాగి ఫోన్ తీసుకుంది. ఏమిటి మమ్మి. నీవు నా భర్తతో కూడా మాట్లాడ నివ్వావా! చూడు కళ్యాణ్ ఏలా చేస్తుందో? నన్ను తొందరగా ఇక్కడి నుండి తీసుకుపో! ఉండలేను. నేను అంటు ఏడుస్తునే ఉంది .ఊరుకో శ్రీజ ముందు విమల్ని చూడు ,తరువాత మాట్లాడు అంటు పెట్టేశాడు. ఇప్పుడు నీకు హాయిగా ఉందా.ఆ మాత్రం దానికి నాకు పెళ్లి ఎందుకు చేశావు. చేసిన నన్ను ఎందుకు ఆయనతో పంపించలేదు .ఇప్పుడేమో ఇట్ల నన్ను సతాయించుతున్నావు. అంటు ఏడుస్తుంది.
నేను నిన్ను సతాయించుతున్నానా గట్టిగా అంటు శ్రీజ మీది కి వెళ్లుతున్న సరళని మనవడిని ఎత్తుకున్న గోపాలరావు ఆపాడు. ఊరుకో సరళ ఏమైంది ?.
నీకు దీని వలన నాకు మొత్తం ఆరోగ్యమే పాడు అయ్యేటట్టుఉంది. అవునా! నేను ఇంకా బతకడం దండుగ అంటు లేచి స్పీడ్గా బాల్కనీలో వెళ్లి దూకడానికి ప్రయత్నం చేస్తున్నా, కూతురుని, ఏందే నీవు వేగంగా వచ్చి చేయి పట్టుకొని లాగి చెంప ఒక దెబ్బ వేసింది. ఆ దెబ్బకి దిమ్మ తిరిగినట్టు అయి స్పృహ తప్పి పడిపోయింది. అయ్యో ఏమైంది ! శ్రీజ అని ఎంతో పిలిచినా ఉలుకుపలుకులేదు. .సరళ భయంగా చూస్తూ కొన్ని నీళ్ళు తెచ్చి కూతురు మొఖం పైన చల్లింది. చిన్నగా ఏదో ఏదో మాట్లాడుతుంది. నేను బతుకను. నేను ఇక్కడ ఉండలేను. కళ్యాణ్ నన్ను తీసికెళ్ళి పో అంటు గొనుకుతుంది
.గోపాల్రావు మెల్లగా లేపి పట్టుకొని మంచం మీద పడుకో బెట్టాడు. అయిన సరిగా మాట్లాడడం లేదు. ఏం చేద్దాం.. సరళ ఆటో తీసుకోని రండి, హసెటల్కి తీసుకెళ్దాం అంది. అలాగే అంటు హసేటల్కి తీసుకు వెళ్లారు. డాక్టర్ టెస్ట్ చేసి ఏమైంది? అని అడిగింది. జరిగినంత చెప్పింది .అంతా పెద్ద పిల్లని కొడుతారా షాకు తగిలింది . ఏం కాదు ఒక ఇంజెక్షన్ సిరెన్ పెడుతాను.కొలుకుంటాది అంది. ఎంత పని చేశాను. ఆవేశం ఆపుకోలేక బిడ్డను ఇలా చేశాను అంటు ఏడుస్తున్న భార్యను నచ్చచెప్పి మనవడిని ఎత్తుకో మని ఇచ్చి, తను మందులు తెలుపడానికి బయటకు వెళ్లాడు.
ఈ విషయం తెలుసుకోని సరళ తమ్ముడు, మరదలు వచ్చా రు. వారిని చూడగానే ఏడిచింది సరళ. ఊరుకోండి వదిన ఏం కాదు మరదలు తమ్ముడు దైర్యం గా ఉండు అక్క అంటు నచ్చచెప్పారు.
శ్రీజకు మెలుకువ వచ్చింది. మమ్మీ నన్ను ఏం చేయకు అంటు ఏదో చెపుతుంది. సరళ ఏడుస్తూ శ్రీజ ఇటు చూడు నేను నీ అమ్మని నన్ను క్షమించు బిడ్డ నేనే ఇలా నీవు కావడానికి కారణం . చిన్నప్పటి నుండి ఒక దెబ్బ, ఒక మాట అనని నేను ఆవేశం లో ఒక చెంప దెబ్బ వేశాను. ఎన్నో మాటలు అన్నాను సారీ రా అంటు లేచి కూర్చున్న కూతురును దగ్గరకు తీసుకుంది. లేదమ్మా ,ఇందులో నా తప్పు కూడా ఉంది .నీ ఆరోగ్యం నాన్న ఆరోగ్యం గురించి ఆలోచించకుండ పని అంతా మీ పైన విమల్ బాధ్యత కూడా మీ మీద వదిలి వేసి పడుకోవడం , నన్ను క్షమించు అంటు తల్లిని మరింత దగ్గరకు తీసుకుంది.
ఈ దృశ్యం చూస్తున్న గోపాల్రావుకి కండ్లలో నీళ్ళు తీరిగి బాబుతో బిడ్డ దగ్గర వచ్చాడు. సారీ నాన్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇప్పటీ నుండి విడి పని నేను చూసుకుంటాను. శ్రీజ అలా మాట్లాడకు , నాన్న మీరు ఉరికే మీ మనవడితో ఆడుకోండి, అంతే చాలు. కొడుకుని తన దగ్గరకు తీసుకోని ముద్దులతో ముంచెత్తింది. సారీ రా నిన్ను ఏడిపించను అంటు గుండెకు అందుకుంది.
సరళ తమ్ముడు మరదలు దగ్గరకు వచ్చి గుడ్ శ్రీజ అలా ఉండాలి. అమ్మకి నాన్న కి సహాయంగా ఉంటు, నీవు నీ పనిని కొడుకు పని చూసుకుంటు ఉంటే ఇక్కడ మీరందరు సంతోషంగా ఉంటారు. అక్కడ మీ ఆయన సంతోషంగా ఉంటాడు .నిజం అత్త కరెక్ట్ మీరు చెప్పింది. అంటు తల్లి తండ్రీ చేతులు పట్టుకుంది .మరి మీ ఆయనకు ఫోన్ చేయి ఆయన కంగారు పడుతాడు కదా! అవును అంటు హాయ్ కళ్యాణ్ ఇక్కడ అంతా ఓకే నువ్వు జాగ్రత్త ,నేను బాబును జాగ్రత్తగా చూసూకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి అంది .థాంక్యూ శ్రీజ ఇందాక నుండి నాకు చాలా టెన్షన్గా ఉండే,
ఇప్పుడు ఈ మాట తో ఎంతో రిలీఫ్ గా ఉంది .జాగ్రత్త అంటు ఫోన్ పెట్టేసాడు. ఈ పని మమ్మీ ఎప్పుడో చేస్తే బాగుండేది. నేను అంతా మొండిగా తయారయ్యే దాన్ని కాదు. ఒక దెబ్బతో నా కండ్లు తెరిపించింది.ఇది అంతా చూస్తున్న నర్సు మీలో ఒక చెంప దెబ్బ ఎంత గొప్ప మార్పు తెచ్చింది కదా అంది. ఆ మాటకు అందరు ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని నవ్వారు.
హామీ పత్రం:ఈ కథ నా స్వీయ రచననేనని హామీ ఇస్తున్నాను.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!